ఈమె మిస్ అవుతున్నది ప్రియుడినా? లండన్ నా?

0

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా హిందీలో మొదటి సినిమా చేసిన శృతి హాసన్ అతి తక్కువ సమయంలోనే హిందీ.. తెలుగు.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఒక స్టార్ వారసురాలు అనే వలయం నుండి శృతి హాసన్ చాలా తొందరగా బయట పడింది. ఆమె నటిగా తనకు తాను ఒక మంచి పేరు దక్కించుకుంది. మూడు భాషల్లో కూడా సమాంతరంగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న ఈ అమ్మడికి లండన్ కు చెందిన వ్యక్తితో పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

లండన్ ప్రియుడితో శృతి హాసన్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు కూడా విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిచారు. ఇద్దరి కెరీర్ గోల్స్ వేరు వేరుగా ఉన్నాయి. కనుక ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం సాధ్యం అవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి బ్రేకప్ ను అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అతడి నుండి విడిపోయి ఏడాది దాటినా కూడా శృతి హాసన్ ఇంకా లండన్ జ్ఞాపకాలను వదలలేక పోతుందని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు మరియు ఆమె వ్యాఖ్యలను బట్టి అర్దం అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేతున్నారు..

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా లండన్ గురించి మాట్లాడటం లండన్ లోని రెస్టారెంట్స్ తాను తిరిగిన ప్రాంతాల గురించి మాట్లాడుతూ మర్చిపోలేక పోతున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది. లండన్ తో ఈ అమ్మడికి ఉన్న అటాచ్ మెంట్ కేవలం అతడి వల్లే కనుక అతడిని మర్చి పోలేకనే లండన్ గురించి పదే పదే సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది అనే కామెంట్స్ వస్తున్నాయి.

అతడిపై ఇష్టం ఉండటంతోనే లండన్ జ్ఞాపకాలను ఆమె భద్రపర్చకుంది.. షేర్ చేస్తుంది అనేది మరికొందరి వాదన. ఇక శృతి సినిమాల విషయానికి వస్తే త్వరలో ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవితేజకు జోడీగా శృతి ఆ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.