RX బాంబ్ ఎందుకు మిస్సవుతోంది?

0

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్- నాగచైతన్య కథానాయకులు గా నటించిన `వెంకీమామ` ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లోకి వస్తోంది. తాజాగా వెంకీమామ మీడియా మీట్ గురించి తెలిసిందే. వేదికపై మామ పంచ్ లు జోకులు కడుపుబ్బా నవ్వించాయి. చైతూ చక్కని స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇదే వేదిక పై రాశీ ఖన్నా బులుగు జిలుగు గళ్ల డ్రెస్ లో తళుక్కుమంది. చైతన్య- రాశీ ఖన్నా జోడీ ఎంతో ఒద్దికగా ముచ్చటగా కనిపించారు. అయితే మామ వెంకీ సరసన నటించిన పాయల్ మాత్రం ఈ వేదికపై ఎక్కడా కనిపించలేదు ఎందుకనో. మామతో పాటు అత్త కనిపించక పోతే అది అల్లుడికి ఇబ్బందికరమే.. అయినా ఎందుకని మిస్సయ్యింది?

అసలింతకీ పాయల్ రాజ్ పుత్ ఇలాంటి కీలకమైన ఈవెంట్ కి స్కిప్ కొట్టిందేమిటో. పైగా `వెంకీమామ` ప్రోమోలు .. విజువల్స్ లోనూ అంతగా హైలైట్ కావడం లేదు ఎందుకని? అంతా అర్థం కాని ఫజిల్ లా ఉంది. కనీసం తెలుగు మీడియా ముందుకు ఇంటరాక్షన్ కోసమైనా వస్తుందా లేదా? అన్నది చూడాలి.

అయితే పాయల్ అన్నిచోట్లా మిస్సవ్వడానికి కారణాల్ని ఆరాతీస్తే కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీమామ లో పాయల్ పాత్ర పరిధి చాలా తక్కువ. తనతో పోలిస్తే రాశీఖన్నా కే ఎక్కువ స్కోప్ ఉంది. అందుకే పాయల్ కాస్తంత గుంభనగా ఉందిట. ఇదొక్కటేనా.. పాయల్ కి ఆర్.ఎక్స్ 100 ఇమేజ్.. ఆర్డీఎక్స్ ఇమేజ్ పెద్ద మైనస్ అని భావించిన చిత్రబృందం కావాలనే తనని హైలైట్ కాకుండా జాగ్రత్త పడుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది. బహుశా ఈ కారణాల వల్ల అలిగిన పాయల్ ఈవెంట్లో నూ ఎక్కడా కనిపించలేదు అంటూ మర్మరింగ్ వినిపిస్తోంది. అసలు పాయల్ కు క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ అయితే లేనే లేవు. అయినా నిన్న ఈవెంట్ స్కిప్ కొట్టింది అన్న ముచ్చటా సాగుతోంది.




Please Read Disclaimer