ఒక్క కెమెరాతోనే ఎన్నో లీక్స్.. వంద కెమెరాలు మరెన్ని లీక్స్ చేస్తుందో?

0

ప్రముఖ నటి కస్తూరి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె కొందరిని టార్గెట్ చేసిందంటే వారిపై ఎప్పుడు ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఈమెకు వనిత విజయ్ కుమార్ మద్య రసవత్తర పోరు సాగింది. ఆ సమయంలో వనిత గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు విమర్శలు ట్రోల్స్ ఇలా అన్ని కూడా నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి. ఇండైరెక్ట్ పంచ్ లు వేయడం ఆమెకు బాగా తెలిసిన విద్య అంటూ ఉంటారు. ఆ తర్వాత ఈమె మీరా మిధున్ గురించి కూడా ట్వీట్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ తమిళం సీజన్ 4 లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సుచిత్ర గురించి కాస్త ఘాటుగానే స్పందించింది.

గత బిగ్ బాస్ సీజన్ లో మీరా మిథున్ రచ్చ రచ్చ చేసింది. పలు వివాదాలకు పేరు మోసిన మీరా మిథున్ మాదిరిగా సుచిత్ర కూడా వివాదాలకు కేంద్ర బింధువు అవుతుందని అంతా భావిస్తున్నారు. అదే విషయాన్ని కస్తూరి కూడా అన్నది. సుచిలీక్స్ విషయాన్ని ప్రస్థావించి గతంలో ఒక్క కెమెరాతోనే చాలా చేశారు. అక్కడ వంద కెమెరాలు ఉంటాయి. ఇంకెన్ని రహస్యాలు లీక్స్ వస్తాయో అంటూ ఫన్నీగా స్పందించింది. సుచిత్ర ను మీరా మిథున్ 2 పాయింట్ ఓ అంటూ సంభోదించింది. మొత్తానికి బిగ్ బాస్ లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో కస్తూరి ట్వీట్స్ చర్చనీయాంశం అయ్యాయి.