పవన్ ని సూరి ఎందుకు కలిసారు?

0

కొన్ని కలయికలు రకరకాల సందేహాలకు కారణమవుతాయి. ఎవరైనా స్టార్ హీరోని ఫలానా దర్శకుడు కలిసాడు అనగానే అసలేం జరుగుతోంది? అంటూ సందేహం వ్యక్తమవుతుంది. పైగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ గురించి సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతున్న ఈ సన్నివేశంలో సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ తనని కలవడం రకరకాల స్పెక్యులేషన్స్ కి కారణమవుతోంది.

ఇప్పటికే పవన్ రీలాంచ్ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తారని ఎంతో కొంత చర్చ సాగింది. ఓవైపు బోనీకపూర్ – దిల్ రాజు- ఆదిత్య శ్రీరామ్ లతో కలిసి పవన్ `పింక్` రీమేక్ పై దృష్టి సారించారని వార్తలు వస్తున్నా.. ఇప్పుడు పవన్ తో సురేందర్ రెడ్డి కనిపించడం పలు సందేహాలకు తావిస్తోంది. సైరా లాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమాని తెరకెక్కించిన దర్శకుడిగా ఇప్పటికే సురేందర్ రెడ్డికి ఇమేజ్ పెరిగింది. మెగా కాంపౌండ్ లో అతడంటే ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందుకే ఇప్పుడు పవన్ తో అతడి మీటింగ్ ఎన్నో సందేహాలకు తావిస్తోంది.

సైరా సక్సెస్ తర్వాత పవన్ తో సినిమా చేయాలన్న ఆసక్తి పవన్ వ్యక్తపరిచారు. పవన్ నటిస్తాను అంటే చరణ్- చిరంజీవి బృందం కొణిదెల ప్రొడక్షన్స్ లోనే సినిమా తెరకెక్కించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇంతకుముందు ప్రకటించారు. అలాగే సైరా సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలన్న ఆసక్తి దిల్ రాజు సహా టాలీవుడ్ అగ్ర నిర్మాతలకు ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ తో సూరి కలయిక దేనికి సంకేతం? అన్న చర్చా వేడెక్కిస్తోంది. పైగా పవన్ ని ఆయన ఇంటి వద్దనే సూరి కలవడం తో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇప్పటి వరకూ ఏ దర్శకుడికి ఓకే చెప్పారు? అన్న సందేహం అభిమానుల్లో అలానే ఉంది. దేనికీ అధికారిక ప్రకటన లేకపోవడంతో అంతా రకరకాలుగా మాట్లాడుకోవడం వేడెక్కిస్తోంది. పవన్-సురేందర్ రెడ్డి-చరణ్ కాంబినేషన్ మూవీ ఉంటుందనే ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి దీని పై కొణిదెల కాంపౌండ్ నుంచి క్లారిటీ వస్తుందేమో చూడాలి.