సూరి కి పవన్ కోసం వెయిట్ చేసేంత ఓపిక ఉందా?

0

దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాల ను కేటాయించాడు. మెగాస్టార్ ప్రతిష్టాత్మకం గా తీసుకున్న సినిమా అవ్వడం తో సైరా కోసం సురేందర్ రెడ్డి చాలా కష్ట పడ్డాడు. సైరా సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించిన సూరి తదుపరి చిత్రం విషయం లో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నాడట. సంవత్సరంకు కనీసం ఒక్క సినిమానైనా విడుదల అయ్యేలా ప్లాన్ చేయాలని సూరి భావిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సైరా విడుదల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న సూరి మళ్లీ మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడట. దర్శకుడు సూరి త్వరలో నే వరుణ్ తేజ్ తో ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇటీవల సురేందర్ రెడ్డి తో మైత్రి మూవీస్ వారు పవన్ కళ్యాణ్ కు స్టోరీ చెప్పించినట్లుగా తెలుస్తోంది. ఆ స్టోరీకి పవన్ ఇంప్రెస్ అయ్యాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు చేసేది ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. పింక్ రీమేక్ తో పవన్ సినిమాలు చేయబోతున్నాడు. పింక్ తర్వాత క్రిష్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా కు పవన్ ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత అంటే 2020 చివరి వరకు పవన్ తదుపరి సినిమా ఉండే అవకాశం ఉంది. మరి దర్శకుడు సురేందర్ రెడ్డి పవన్ తో సినిమా చేయడం కోసం ఓపికగా అప్పటి వరకు వెయిట్ చేస్తాడా అనేది చూడాలి. ఆలోపు ఒక చిన్న సినిమా ను సూరి చేస్తాడో లేదంటే పవన్ తో ఛాన్స్ మిస్ చేసుకో వద్దనే ఉద్దేశ్యం తో వెయిట్ చేస్తాడో చూడాలి.

పవన్ ను కలవడానికి ముందు సురేందర్ రెడ్డి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా కలిసినట్లు గా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దాంతో సూరి ఈ ముగ్గురి లో ఎవరి తో సినిమా చేస్తాడో మరి.
Please Read Disclaimer