ట్రెండీ టాక్: టబు వారసుడొస్తున్నాడు!

0

సీనియర్ నటి టబు నటవారసుడు బరిలో దిగుతున్నాడా? అయినా టబు పెళ్లి చేసుకోలేదు కదా? వారసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

జాతీయ ఉత్తమ నటి టబు పరిశ్రమలో మూడున్నర దశాబ్ధాలుగా కెరీర్ ని సాగిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు-తమిళ్- హిందీ పరిశ్రమల్లో సుపరిచితం. కింగ్ నాగార్జున- వెంకటేష్ – చిరంజీవి- బాలకృష్ణ వంటి స్టార్లతో నటించిన సీనియర్ బ్యూటీ టబు. ప్రస్తుతం అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టబు ఓ వైపు లైమ్ లైట్ లో ఉండగానే తన వారసుడు బరిలోకి వస్తున్నాడంటూ ఓ కొత్త ప్రచారం ఊపందుకుంది.

అయితే బాలీవుడ్ లో అడుగు పెడుతున్న ఈ నటవారసుడు టబు కి వారసుడు కాదు.. టబు అక్క ఫర్హా కుమారుడు. పేరు ఫతే రాంధవ. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న `దోస్తానా 2`లో అవకాశం దక్కించుకోనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ – జాన్వీ కపూర్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఇదే చిత్రంతో రాంధవ హీరోగా తెరకు పరిచయం కానున్నాడట. 2008 బ్లాక్ బస్టర్ దోస్తానాకు దాదాపు 11 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. ఇక టబు ఫ్యామిలీ ఉత్తరాది మూలాల్ని పరిశీలిస్తే.. టబు అక్క ఫర్హా `ఫాజిల్` (1985) అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా తెరవెనక్కి వెళ్లిపోయి విందూ అనే కుర్రాడిని పెళ్లాడారు. అటుపై ఆ ఇద్దరికీ బ్రేకప్ అయ్యాక సీనియర్ నటి సైరాభాను మేనకోడలు షహీన్ మాజీ భర్త సుమీత్ సైగల్ ని టబు సిస్టర్ ఫర్హా పెళ్లాడారు. సహీన్- సుమీత్ జంట కుమార్తె సయేషా సైగల్ ఇటీవలే తమిళ హీరో ఆర్యను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అంత లింక్ ఉందన్నమాట.
Please Read Disclaimer