ఆ డైరెక్టర్ కి గిఫ్ట్స్ అంటే పిచ్చా!

0

కొందరికి గిఫ్ట్ లంటే పిచ్చి. వాటి కోసం చెవి కోసుకుంటారు. ఆ యంగ్ డైరెక్టర్ కి గిఫ్ట్ లంటే విపరీతమైన పిచ్చి అంట. ఎవరైనా స్నేహితుడో లేక తెలిసిన వాళ్లో విదేశాలకు వెళితే కచ్ఛితంగా అక్కడి నుంచి గిఫ్ట్ కొని తేవాలట. ఇంతకీ ఆ గిఫ్ట్ ఎలాంటిది? అంటారా..

కచ్ఛితంగా గమ్మత్తయిన గిఫ్లే అది. ఫారిన్ నుంచి వచ్చేప్పుడు నా కోసం ఓ రెండు మందు బాటిల్స్ కొని తేవాల్సిందే అంటూ నిర్మొహమాటంగా అడిగేస్తాడట. విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ కి తెలిసినవారికి ఫోన్ చేసి ఫలానా బ్రాండ్ మందు బాటిల్ కొని తేవాల్సిందేనంటూ చెబుతుంటాడట.

ఇంటి నిండా ఎన్ని మందు బాటిల్స్ ఉన్నా.. ఇంకా ఇంకా బాటిల్స్ కోసం ఆరాటపడుతుంటాడు. ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలి అంటాడు. తెలిసిన వారు ఎవరు విదేశాలకు వెళ్లినా వెంటనే వాళ్లకు చెబుతాడు. ఆ పిచ్చితో ఎవరు తనను కలిసేందుకు వచ్చినా వారికి ఇదే ప్రపోజల్ పెడుతున్నాడట. ప్రస్తుతం ఆ నోటా ఈనోటా అది కాస్తా పబ్లిక్ అయిపోతోంది. ఆయనగారి గిఫ్టుల పిచ్చేమిటో ఇంతకీ మందు అంటే పిచ్చా.. లేక గిఫ్ట్ అంటే పిచ్చా? అంటూ నసిగేస్తున్నారు.
Please Read Disclaimer