రాజ్ తరుణ్ సినిమా పరిస్థితి అలా ఉందా?

0

న్యూ జెనరేషన్ యువహీరోలలో ఒకరైన రాజ్ తరుణ్ కు మంచి గుర్తింపే ఉంది. మొదట్లోవరస హిట్లతో తన సత్తా చాటిన రాజ్ తరుణ్ తర్వాత కాలంలో వెనకబడ్డాడు. కంటిన్యూగా ఎదురైన ఫ్లాపులతో దాదాపు ఫేడ్ అవుట్ అయ్యాడేమో అనే దశకు చేరుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు.

జీఆర్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్యే ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు.. లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తూ సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు బిజినెస్ మాత్రం జరగడం లేదని ఇన్సైడ్ టాక్. రాజ్ తరుణ్ గత సినిమాల ఎఫెక్ట్.. ఈ మధ్య దిల్ రాజు టేకప్ చేసిన చిన్న సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తుండడంతో ఈ సినిమా రైట్స్ తీసుకునేందుకు బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదట.

అయితే రాజుగారు తనదైన శైలిలో చక్రం తిప్పి బిజినెస్ పూర్తి చేసి గట్టెక్కొచ్చేమో కానీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయా రావా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఈ మధ్య చిన్న సినిమాలన్నీ ఓపెనింగ్స్ విషయంలో తడబడుతున్నాయి. హిట్లతో జోరుమీద ఉండే హీరో అంటే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు..అదే ఫ్లాపులలో ఉన్న హీరో సినిమాలకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ‘టాక్ సూపర్ అని వస్తే సినిమా చూద్దాంలే’ అనే ఆలోచనతో మొదటి రోజు సినిమాను చూడడం లేదు. మరి ఇలాంటి అడ్డంకులను రాజ్ తరుణ్ ఎలా దాటుతాడో వేచి చూడాలి.
Please Read Disclaimer