మహేష్ ని అందుకే సోదరా అని పిలిచాడా సూర్య?

0

బాలీవుడ్ లో సోదర భావంపై ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. అయితే అలాంటిది కాదు కానీ.. సౌత్ లోనూ హీరోల మధ్య అలాంటి సోదర భావం ఉండనే ఉంది. ఒకరి సినిమా ప్రమోషన్ కి ఇంకొకరు సాయం చేసుకోవడం.. సాటి హీరోలతో స్నేహం చేయడం అనే అలవాటు సత్సాంప్రదాయం మనకు ఉంది.

లేటెస్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనుబంధంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ ఒకరి సినిమాకి ఒకరు ప్రమోషన్ చేసుకోవడం చర్చకు తావిస్తోంది. మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాటకు ఇప్పటి నుంచే సూర్య ప్రమోషన్ చేస్తుంటే.. సూర్య నటించిన `ఆకాశమే హద్దురా`కి మహేష్ తనవంతు ప్రమోషనల్ సాయం చేశారు. ఈ సందర్భంగా మహేష్ ని సూర్య దయగల సోదరుడు అంటూ మహేష్ గురించి ప్రస్థావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

`సర్కారు వారి పాట` కనెక్షన్ తో మహేష్ కు ధన్యవాదాలు చెప్పారు సూర్య. నిన్న రాత్రి మహేష్ ట్విట్టర్ లోకి వెళ్లి.. సూరియా నటించిన తాజా చిత్రం సూరరై పొట్రూ (తెలుగులో ఆకాసం నీ హద్దూ రా) పై ప్రశంసలు కురిపించారు. తన ప్రతిస్పందనలో సూర్య మహేష్ కి థాంక్స్ చెబుతున్నారు. ఈ ఉదయం కూడా అలానే మహేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

“చాలా దయగల సోదరుడు.. ఒక టన్ను ధన్యవాదాలు” అంటూ మహేష్ అభిమానుల హృదయాల్ని దోచాడు సూర్య. త్వరలో ప్రారంభించనున్న సర్కారు వారి పాట సినిమాని వీక్షించేందుకు తాను ఆసక్తిగా వేచి చూస్తున్నానని సూర్య అన్నారు.

మహేష్ – సూర్యా ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభ దశ నుండి మంచి స్నేహితులు. వాస్తవానికి సూరియా తమ్ముడు కార్తీ .. మహేష్ చెన్నైలో వారి చిన్ననాటి రోజుల్లో క్లాస్మేట్స్ అన్న సంగతి తెలిసింది తక్కువమందికే. బహుశా అందుకే సూర్య ఇలా సోదరుడు అని పిలిచారా?