అందుకే ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారా ?

0

నిజానికి ఒక డెబ్యూ హీరో సినిమా అంటే ఆచీ తూచీ వ్యవరరిస్తారు. అందులోకి కాస్త బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో లాంచింగ్ సినిమా అయితే ఇక అన్నీ అందరితో డిస్కస్ చేసాకే నిర్ణయిస్తారు. ఇప్పుడు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సినిమా విషయంలోనూ అదే జరిగింది.

ఆ మధ్య అశోక్ గల్లా మొదటి సినిమా భాధ్యతను దిల్ రాజుని నమ్మి శశి అనే కొత్త దర్శకుడి చేతిలో పెట్టారు. అది లాంచ్ అయిన కొన్ని రోజులకే క్యాన్సల్ అయింది. ఆ తర్వాత అశోక్ డెబ్యూ సినిమా విషయంలో మహేష్ ఫ్యామిలీ మొత్తం ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచించారట. ఆ సమయంలోనే శ్రీరామ్ ఆదిత్య ఓ యూత్ ఫుల్ కథతో వెళ్లి గల్లా ఫ్యామిలీని కలిసాడట.

నిజానికి మహేష్ ఫ్యామిలీ హీరో సుధీర్ బాబుకి తొలి హిట్ ఇచ్చింది శ్రీరామ్ అదిత్యనే. ‘ఎస్.ఎం.ఎస్’ అనే సినిమాతో లాంచ్ అయినా సుధీర్ సక్సెస్ ఫుల్ జర్నీ ‘భలే మంచి రోజు’ నుంచే స్టార్ట్ అయింది. అందుకే మహేష్ కూడా శ్రీరామ్ ఆదిత్యకే ఓటేశాడట. ఇక సుధీర్ కి సక్సెస్ సినిమా ఇచ్చి హీరోగా నిలబెట్టిన శ్రీరామ్ ఇప్పుడు అశోక్ కి కూడా డెబ్యూ సినిమాతోనే సూపర్ హిట్ ఇస్తాడాని భావించి అందరూ ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారట. మరి ఘట్టమనేని గల్లా ఫ్యామిలీ పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీ రామ్ ఆదిత్య ఎంత వరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer