‘వెంకీ మామ’ క్లైమాక్స్ ట్విస్ట్ అదేనా ?

0

కొన్ని సినిమాలు ఎమోషనల్ కంటెంట్ మీదే ఆదారపడి తెరకెక్కుతాయి. ‘వెంకీ మామ’ కూడా అదే కోవలోకొచ్చే సినిమా అంటున్నారు. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్ -నాగ చైతన్య రీల్ లైఫ్ లో కూడా మామ అల్లుళ్ళుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 13న థియేటర్స్ లోకి వస్తుంది.

సినిమాలో వెంకటేష్ పల్లెటూరి బిజినెస్ మెన్ గా కనిపిస్తే చైతూ మిలటరీ మెన్ గా కనిపించనున్నాడు. అయితే సినిమాలో ఎంత ఎంటర్టైన్ మెంట్ ఉంటుందో ఎమోషన్ కూడా అంతే ఉంటుందనే టాక్ గట్టిగా వినబడుతుంది. లేటెస్ట్ గా తమన్ కూడా సినిమా చూస్తూ ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఏడ్చేసానని మీడియా ముందు చెప్పాడు.

దీంతో ‘వెంకీ మామ’లో చైతూ క్యారెక్టర్ కి సంబంధించి ఏదైనా సాడ్ ఎండింగ్ ఉంటుందా ? అనే ప్రశ్న అందరిలో మొదలవుతుంది. ఒక వేల దేశం కోసం చేసే యుద్ధంలో చైతూ కనిపోతాడా అనే డౌట్స్ కూడా ఆడియన్స్ లో రైజ్ అవుతున్నాయి. మరి సినిమాలో ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఆ ఎలిమెంట్ ఏంటో తెలియాలంటే ఇంకొద్ది రోజు ఆగాల్సిందే.
Please Read Disclaimer