ఓవర్సీస్ మార్కెట్ ఇంత డల్ గానా?

0

ఓవర్సీస్ మార్కెట్ సరళిని పరిశీలిస్తే ఊహించని షాకింగ్ నిజాలు ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఇటీవల సన్నివేశం చూస్తుంటే విదేశాల్లో ఊహించని పరిణామాల నేపథ్యంలో సక్సెస్ లేక చతికిలపడడంపై కొన్ని ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. బాహుబలి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ బావుంది అనుకుంటే ఇంతలోనే ఇది ఊహించని పరిణామం.

అసలెందుకు ఓవర్సీస్ బాక్సాఫీస్ ఇటీవల దారుణ ఫలితాల్ని ఎదుర్కొంటోంది? అంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. ఓవర్సీస్ బయ్యర్లు పంపిణీదారులకు సినిమాలపై సరైన జడ్జిమెంట్ లేకపోవడం ఒక కారణం అనుకుంటే అక్కడ సిండికేట్ మాఫియా కనుసన్నల్లో సినిమాని రిలీజ్ చేయాల్సి రావడంపైనా గత కొంతకాలంగా ఆందోళన నెలకొంది. కొత్త పంపిణీదారుల్ని రానివ్వని మాఫియా కూడా అక్కడ తయారైందన్న వార్త నిర్మాతల్ని భయపెడుతోంది. ఒక రకంగా ఓవర్సీస్ లో ఓ పెద్ద సిండికేట్ అక్కడ మార్కెట్ కి గండి కొట్టడంపైనా తీవ్రంగానే చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాతల్లో ఈ ప్రత్యేక టాపిక్ పై వాడి వేడిగా చర్చ సాగుతోంది.

రంగస్థలం.. భరత్ అనే నేను తర్వాత ఇటీవల వచ్చిన చాలా పెద్ద సినిమాలు.. పాన్ ఇండియా సినిమాలు ఓవర్సీస్ లో దారుణంగా చతికిల బడ్డాయి. ఇక చిన్న సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు అంటూ రిలీజ్ చేసినవి కూడా ఓవర్సీస్ లో ఆశించిన ఫలితం అందుకోలేదు. పెద్ద సినిమాల బాటలోనే చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు ఫెయిలవుతూనే ఉన్నాయి. పంపిణీదారుడికి పెట్టిన పెట్టుబడిని అయినా తిరిగి ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు రిలీజ్ కి రాబోతున్న అందరు హీరోల సినిమాలపైనా ఆ ప్రతికూల ప్రభావం పడిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. 2020 సంక్రాంతికి రిలీజవుతున్న సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో లాంటి చిత్రాలు మినహా ఇతర సినిమాలకు ఓవర్సీస్ ప్రతికూలంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. వేటికీ సరైన బిజినెస్ అవ్వక నిర్మాతల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేదు. ఈ నవంబర్ డిసెంబర్ సినిమాల సన్నివేశమేమిటో అంటూ ప్రస్తుతం విశ్లేషణలు సాగుతున్నాయి.
Please Read Disclaimer