తెలుగమ్మాయి ఎదురు చూపులకు తెర పడేనా?

0

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం చాలా కష్టం అయ్యింది. అందం మరియు అభినయం రెండూ ఉన్నా కూడా ఏదో కారణం చెప్పి ఇండస్ట్రీ వారు పక్కకు పెడుతున్నారు. స్టార్ హీరోలు మొహమాటమో లేదంటే మరేంటో కాని తెలుగు అమ్మాయిలతో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. చిన్న హీరోలతో మాత్రమే తెలుగు అమ్మాయిలు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఈషా రెబ్బా ఈమద్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న తెలుగు హీరోయిన పేరు. ఈమె వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు గుర్తింపు రాలేదు.

ఆమద్య అరవింద సమేత చిత్రంలో ఒక పాత్రను చేసినా అది కరివేపాకు పాత్ర అన్నట్లుగానే ఉంది. కనుక దాంతో గుర్తింపు దక్కలేదు. ఎట్టకేలకు ఈషా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు తెర పడేట్లుగా ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘రాగల 24 గంటల్లో’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. సినిమా టీజర్ మరియు ట్రైలర్ లతో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు.

ఈ చిత్రంతో ఈషా కెరీర్ టర్న్ అవుతుందనే నమ్మకంను ఆమె సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఈషా మీడియాతో మాట్లాడుతూ.. పాత్రల ఎంపిక విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు భయపడతానంది. మంచి పాత్రలను ఎంపిక చేసుకుని చేయాలని తాను కోరుకుంటానంటూ చెప్పుకొచ్చింది. కథ విషయం పక్కన పెట్టి నా పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటూ ఈషా చెప్పుకొచ్చింది. స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పింది.
Please Read Disclaimer