బాలయ్య వారసుడి ఎంట్రీ లేనట్టేనా?

0

స్టార్ హీరో ల తనయులు నటనను కెరీర్ గా ఎంచు కోవడం.. సినిమాల్లో స్టార్ హీరోలు గా ఎదగాలని.. తండ్రిని మించి రాణించాలని ప్రయత్నించడం చాలా సాధారణ విషయం. ఈమధ్య స్టార్ హీరోల తనయులే కాదు. 24 శాఖల్లో పని చేసే సీనియర్ల వారసులు కూడా హీరోలు గా ప్రయత్నిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ప్రముఖ మైన సినీ కుటుంబం.. ఘనమైన వారసత్వం ఉన్న మోక్షజ్ఞ తేజ నటన పట్ల ఆసక్తి గా లేడనే టాక్ వినిపిస్తోంది.

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ పై చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకూ ఆ దిశగా అడుగులు పడినట్లు కనిపించడం లేదు. రీసెంట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే బాలయ్య తనయుడి కి సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉందట. అందుకే తనకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే రంగం లో బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాడట. అందు వల్లనే మీడియా ఫోకస్ కు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు.

బాలయ్య కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి మాట్లాడక పోవడంతో ఈ వాదన నిజమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. నిజానికి బాలయ్య తనయుడి ఎంట్రీ పై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. మరి ఈ విషయంలో బాలయ్య క్లారిటీ ఇచ్చి మోక్షజ్ఞ కెరీర్ విషయం లో వస్తున్న వార్తల కు చెక్ పెడతారేమో వేచి చూడాలి.
Please Read Disclaimer