డబ్బు సంపాదనే నయన్ ఆంతర్యమా?

0

లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార ప్రస్తుతం తమిళనాట అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు దక్కించుకుంది. కేవలం తమిళనాట మాత్రమే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే నయన్ తార పారితోషికంను క్రాస్ చేసే హీరోయిన్ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. అంతటి పారితోషికం అందుకోవడంతో పాటు లేడీ సూపర్ స్టార్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్న నయనతార చేసే సినిమాలు.. పాత్రలు ఎలా ఉండాలి. సినిమా మొత్తం ఆమె లీడ్ చేసేలా లేదంటే కథలో చాలా ముఖ్యమైన పార్ట్ అయినా అయ్యి ఉండాలి.

ఒక వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంటున్న నయనతార కమర్షియల్ చిత్రాల్లో స్టార్ హీరోలకు జోడీగా ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రలు చేస్తుంది. విజయ్.. రజినీకాంత్ లతో కలిసి ఈమద్య ఈ అమ్మడు చేసిన సినిమాల్లో ఆమె పాత్రకు అసలు ప్రాముఖ్యతే లేదు. పాటలు రెండు మూడు సీన్స్ కు తప్ప ఆమె అసలు పెద్దగా కనిపించనే లేదు. ఇటీవల చేసిన దర్బార్ చిత్రంలో నయన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఆమె కేవలం 20 నుండి 30 నిమిషాలు మాత్రమే ఉంది.

లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నయన్ ఇలాంటి చిన్నా చితకా పాత్రలకు ఓకే చెప్పడం ఏంటీ అంటూ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. దర్బార్ చిత్రం చేయడమే చాలా పెద్ద తప్పు అంటూ ఉండగా ఇప్పుడు అదే తప్పును మళ్లీ మళ్లీ చేసేందుకు నయన్ సిద్దపడుతూనే ఉంది. తాజాగా రజినీకాంత్ తో మరో సినిమాను చేసేందుకు నయన్ ఓకే చెప్పింది. శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఆ చిత్రంలో ఇప్పటికే కీర్తి సురేష్ ను ఎంపిక చేయడం జరిగింది.

ఆమెతో పాటు ఇప్పుడు నయనతార కూడా మరో హీరోయిన్ గా ఈ చిత్రంలో కనిపించబోతుంది. రజినీకాంత్ మూవీలో హీరోయిన్స్ కు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అది కూడా ఇద్దరు హీరోయిన్స్ అంటే అసలు కనీసం పావుగంట సమయం అయినా స్క్రీన్ స్పేస్ ఉంటుందో లేదో అనుమానమే. అయినా కూడా అలాంటి పాత్రలకు నయన్ ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది.

నయన్ కేవలం పారితోషికం కోసమే సినిమాలు చేస్తుందని అంటున్నారు. భారీ పారితోషికం ఆఫర్ చేస్తే సినిమాలోని కథ ఎలా ఉన్నా.. హీరో ఎవరు అయినా కూడా ఒప్పుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా చాలా మంది పేరు తెచ్చుకున్న తర్వాత మంచి పాత్రల్లో నటించాలని కోరుకుంటారు. కాని నయన్ మాత్రం పారితోషికమే ఆంతర్యంగా పిచ్చి పాత్రలన్నీ చేస్తుందని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.