ఈ మెగా కాంబో సాధ్యమయ్యేనా ?

0

ఇవాళ ఓ మీడియా వర్గంలో చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సీనియర్ హీరొయిన్ విజయశాంతి నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు రావడం మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. ఒకప్పుడు ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని తమ కాంబో ద్వారా బాక్స్ ఆఫీస్ కు అందించిన చిరు విజయశాంతిలకు కలిసి చూడటం అంటే ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుంది.

ఈ ఇద్దరు నటించిన ఆఖరి చిత్రం మెకానిక్ అల్లుడు. వచ్చి 25 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు రిపీట్ చేయడం అంటే ఆ మాత్రం యాంగ్జైటి ఉండటం సహజమే కదా. అయితే ఇది నిజమా కాదా అనే నిర్ధారణ ప్రస్తుతానికి లేదు. కేవలం గాసిప్ రూపంలో మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. నిజంగానే కొరటాల విజయశాంతిని సంప్రదించాడా అనే క్లారిటీ లేదు. గతంలో ఇలా చిరుతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న మాజీ హీరొయిన్ ఒక్క మాధవి మాత్రమే.

ఖైది తర్వాత కొన్ని హిట్స్ లో నటించాక మళ్లి బిగ్ బాస్ లో ఓ స్పెషల్ రోల్ చేశారావిడ. ఇప్పుడు విజయశాంతి ఓకే అంటే మరోసారి అరుదైన కాంబోని చూడొచ్చు. హీరొయిన్ కాకపోయినా చాలా కీలకమైన పాత్ర అయితే తప్ప విజయశాంతి ఓకే చెప్పే ఛాన్స్ లేదు. అందుకే 13 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మేకప్ ఎప్పుడు వేసుకున్నా తనకంటూ ప్రత్యేకమైన ఫాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ ఉంది కాబట్టి విజయశాంతి ఏ సినిమాలో నటించినా దానికి అదనపు వెయిటేజ్ వచ్చినట్టే
Please Read Disclaimer