పవన్ రెమ్యూనరేషన్ డీల్ ఇదేనా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సినిమాలు చేస్తున్నారనే విషయం ఇప్పటికే ఒక హాట్ టాపిక్ అయింది. పవన్ రీఎంట్రీ సినిమా విషయాలు ఇప్పటికే అభిమానులను సంతోషపెడుతున్నాయి. ఇప్పటికే పవన్ ‘పింక్’ రీమేక్ లో నటిస్తున్నారనే విషయం బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ధృవీకరించిన విషయం తెలిసిందే. దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడని కూడా ఇప్పటికే కన్ఫాం అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘పింక్’ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే పవన్ రెమ్యూనరేషన్ గురించి కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ ఈ సినిమాకు రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటుగా సినిమాకు వచ్చిన లాభాల్లో 25% వాటా తీసుకుంటారని సమాచారం. ఈ సినిమాకు మాత్రమే కాకుండా పవన్ ను సంప్రదిస్తున్న ఇతర నిర్మాతలకు కూడా పవన్ తరఫువారు సేమ్ రెమ్యూనరేషన్ డీల్ చెప్తున్నారట. ఈ డీల్ ప్రకారం పవన్ రెమ్యూనరేషన్ టోటల్ గా రూ. 50 కోట్లు దాటే అవకాశం ఉంది.

టాలీవుడ్ లో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ మహేష్ బాబు మాత్రమే. ప్రభాస్ కూడా ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ఉండొచ్చు కానీ వరసగా హోం బ్యానర్ పై సినిమాలు చేస్తుండడంతో రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై క్లారిటీ లేదు. ఏదేమైనా పవన్ రెమ్యూనరేషన్ ను బట్టి ఆయన క్రేజ్ ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. మరి రీఎంట్రీ లో పవన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer