సాయి పల్లవిని చూసి నేర్చుకోదా?

0

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. చక్కెర బిళ్ళ కాదేదీ కవితకనర్హం. ఈ కవిత్వ సారాన్ని తెలివిగా బుర్రలోకి ఎక్కించుకుందో ఏమో.. అసలు తాను ప్రచారం చేయాల్సిన బ్రాండ్ ఫలానా రకంగా ఉండాలి అన్న కండిషన్ ఏదీ పెట్టుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. సదరు కార్పొరెట్ కంపెనీతో డీల్ కుదుర్చుకోవడమే అజెండాగా రెడీ అయిపోతోంది. ఇప్పటికే టాప్ బ్రాండ్స్ కి పబ్లిసిటీ చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. అది సరిపోనట్టే తాజాగా మరో ఆరు బ్రాండ్లకు సంతకాలు చేసిందట. ఈ దెబ్బతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకున్న హాట్ బేబీగా ఇండస్ట్రీలో పాపులరైపోతోంది.

ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే ప్రత్యేకించి చెప్పాలా? సౌత్- నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఓ వెలుగు వెలుగుతున్న కుర్రబ్యూటీ కియరా అద్వాణీ గురించే ఇదంతా. ఈ భామ తాజాగా ఆరు కార్పొరెట్ బ్రాండ్లకు కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో జువెలరీ- డిజైనర్ స్టోర్స్- బేవరేజెస్-మోటార్ బైక్ కంపెనీలు ఉన్నాయి. అలాగే మరో రెండు కాస్మోటిక్స్ సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు ఉన్నాయి. వీటికోసం భారీగా ముడుతోందని సమాచారం.

ఓవైపు బాలీవుడ్ లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ కోట్లలో ఆర్జిస్తోంది. అందుకు అదనంగా ఇలా బ్రాండ్ పబ్లిసిటీతోనూ కుమ్ముస్తోంది అంటూ యూత్ మాట్లాడుకుంటున్నారు. ఇక కోటి ఆఫర్ ఇస్తేనే బ్రాండ్ నచ్చక కాదనేసింది సాయి పల్లవి. తనని చూసి కొంచెమైనా ఎథికల్ గా ఆలోచించదా? అంటూ కొందరు కియరాపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు కొందరు. కొన్ని సౌందర్య సాధకాలు.. కోలా కంపెనీలు మోసపూరిత ప్రకటనలతో జనాలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. వాటికి ఎందుకిలా స్టార్ స్టడ్ పబ్లిసిటీ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.
Please Read Disclaimer