మెగా బ్రదర్ జడ్జి.. మెగా ప్రిన్స్ స్కిట్?

0

బుల్లితెర రియాలిటీ షోల వేదికగా సినిమా ప్రమోషన్స్ రెగ్యులర్ గా చూస్తున్నదే. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న `బిగ్ బాస్`.. కపిల్ శర్మ షో.. కాఫీ విత్ కరణ్ షో.. నచ్ బలియే డ్యాన్స్ రియాలిటీ షో.. ఈ వేదికలపై అప్ కమ్ రిలీజ్ లకు స్టార్లు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ మంది బుల్లితెర వీక్షకులకు చేరువయ్యేందుకు వీటిని సరైన వేదికలుగా భావిస్తుంటారు. ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` చిత్రాన్ని హిందీ బుల్లితెరపై ఇదే తరహాలో ప్రచారం చేశారు. కాఫీ విత్ కరణ్ మొదలు.. నచ్ బలియే వేదికపైనా ప్రభాస్ సిగ్గు విడిచి ప్రచారంలో పాల్గొన్నాడు.

ఈ ట్రెండ్ టాలీవుడ్ లోనూ వేడెక్కిస్తోంది. తెలుగు బిగ్ బాస్ వేదికపైనా సినిమాల ప్రచారం జోరుగానే సాగుతోంది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా కొనసాగుతున్న `జబర్థస్త్` బుల్లితెర షోలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రానికి ప్రచారం చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాల్మీకి నిర్మాణానంతర పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 20న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. వచ్చే వారం జబర్ధస్త్ ఎపిసోడ్స్ కోసం చేసిన షూటింగ్ లో ఓ స్కిట్ లో వాల్మీకి గెటప్ తో వరుణ్ తేజ్ స్కిట్ రక్తి కట్టించనుందట.

ఇంతకుముందు ఇదే తరహాలో వరుణ్ సోదరి నిహారిక ఓ స్కిట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హైపర్ ఆది ఆ స్కిట్ కి స్క్రిప్టు అందించారు. తాజాగా సిస్టర్ ని ఫాలో అవుతూ అన్నయ్య వరుణ్ కూడా స్కిట్ లో పెర్ఫామ్ చేస్తుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదో ఒక రకంగా సినిమాకి ప్రచారం చేయడం జనాల్లోకి తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్. జబర్ధస్త్ కి క్లాస్ ఆదరణ ఉందా లేదా అన్నది అటుంచితే మాస్ కి బాగా చేరువైన షో ఇది. అందుకే ఇక్కడ ప్రచారం సినిమాకి కలిసొస్తుందని వరుణ్ తేజ్ భావించారన్నమాట. మెగా బ్రదర్ జడ్జిమెంట్.. మెగా ప్రిన్స్ స్కిట్ చేయడమా? ఐడియా బావుందే!
Please Read Disclaimer