మెగా ప్రిన్స్ నో చెప్పాడా.. ఇది నిజమా?

0

సైరా: నరసింహారెడ్డి` లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించినా హిందీ మార్కెట్లో అనూహ్యంగా డీలా పడడం మెగా కాంపౌండ్ ని తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు 50 కోట్ల మేర డెఫిసిట్ పడిందని అప్పట్లో లెక్కల్ని రివీల్ చేసింది ట్రేడ్. సైరా రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి తదుపరి మరో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్టును రెడీ చేసి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమాకి ఆయన ప్లాన్ చేశారు. అయితే దానికి సంబంధించిన అధికారిక కన్ఫర్మేషన్ ఏదీ లేదు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేయాలని భావించినా మరో రెండేళ్ల పాటు తనకోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందిట. ఆ క్రమంలోనే విరామానికి స్కోప్ ఇవ్వకుండా వెంటనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సూరి ప్రయత్నించారు.

ఈ ప్రాజెక్టుకు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఇప్పుడు నో చెప్పారని ప్రచారమవుతోంది. సైరా పారితోషికం విషయంలో నిర్మాత రామ్ చరణ్ లతో సూరి ఘర్షణ పడ్డారని.. కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత చరణ్ పై దర్శకసంఘం- నిర్మాతల మండలి లో ఫిర్యాదు చేశారని ఇటీవల ప్రచారమైంది. ఆ క్రమంలోనే మెగా ప్రిన్స్ తో సూరి డీల్ క్యాన్సిల్ అయ్యిందని చెబుతున్నారు.

అయితే ఈ ప్రచారం నిజమా? అసలేం జరుగుతోంది? సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ ఎంతో సన్నిహితుడు. ఆ ఇద్దరి మధ్యా చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. చర్చలతో పరిష్కరించుకోవాల్సినది కాస్తా ఫిర్యాదు వరకూ వెళ్లిందా? తదనంతర పరిణామాలేమిటి? ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ఘటనల నేపథ్యం లోనే వరుణ్ తేజ్ సూరి తో సినిమా కి నో చెప్పాడన్న ప్రచారంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer