ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ ఎవరంటే…

0

తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ 12వ వారం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే 86 రోజులు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ ఛాంపియన్ గా ఎవరు గెలుస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. రోజురోజుకు ఈక్వేషన్లు మారుతున్నాయి. ఇక ఈ వారం హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యులు నామినేషన్ జోన్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి తమకు ఇచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలం కావడంతో బిగ్ బాస్ అందరిని నామినేట్ చేశాడు.

ఇక ఈ వారం వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అని అంచనాలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించినప్పుడు వీక్ కంటెస్టెంట్ గా ఉన్న వితిక అదృష్టం కలిసి వచ్చి చివరి స్థానంలోకి ప్రవేశించింది. రెండుసార్లు నామినేషన్ నుంచి తప్పించుకోవటం – ఒకసారి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ త్యాగం చేయటం – మరోసారి కెప్టెన్ గా ఉండడంతో వితిక ఎలిమినేషన్ నుంచి బయటపడింది. ఇక తాజాగా బిగ్ బాస్ ఫైనల్ దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్ లో ఉన్న ఆమె ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

పలు ప్రైవేటు పోల్స్ కూడా ఆమె ఓటింగ్ లో చాలా దరుణంగా వెనకపడి ఉన్నట్టు చూపిస్తున్నాయి. అటు వరుణ్ సందేశ్ కూడా తన భార్యను నామినేషన్ల నుంచి రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక తాజాగా వితికాని సేవ్ చేయడంలో భాగంగా వరుణ్ పంతానికి పోయి అందరూ నామినేట్ అయ్యేలా చేశాడు. వితిక ను సేవ్ చేసే క్రమంలో వరుణ్ సందేశ్ సైతం గెలిచే అవకాశాలను చేజేతులా పాడు చేసుకున్నట్లు అయింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలివారంలో వితికను కేవలం కంటెస్టంట్ గా మాత్రమే చూసిన వరుణ్ ఇప్పుడు ఆమెపై అతి ప్రేమ చూపించడం మొదలు పెట్టాడు.

ఆమెను చివరి వారం వరకు ఇంట్లో ఉంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రయత్నాలే ఇప్పుడు తాను టైటిల్ గెలుచుకునే అవకాశాలకు గండి కొట్టాయి. ఇక తాజాగా వరుణ్ శివజ్యోతితో మాటల యుద్ధానికి దిగడం ద్వారా తనకున్న ఓర్పు కూడా కోల్పోయాడు. ఏదేమైనా తన భార్య ను సేవ్ చేసే ప్రయత్నంలో వరుణ్ టైటిల్ పోరులో వెనుకబడ్డాడు అన్నది మాత్రం వాస్తవం.
Please Read Disclaimer