గర్ల్ ఫ్రెండ్ ను గాల్లోకి లేపిన ఇస్మార్ట్ శంకర్

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘దిమాక్ ఖరాబ్’..’జిందాబాద్ జిందాబాద్’ అంటూ సాగే లిరికల్ సాంగ్స్ ను విడుదల చేశారు. ‘గడబిడలకు బేఫికర్’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కూడా విడుదలయింది. సంగీత దర్శకుడు మణిశర్మ ట్యూన్స్ కు మ్యూజిక్ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమానుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ రెడీ అవుతున్నారు.

జూన్ 29 వ తేదీ ఉదయం 11 గంటలకు ‘ఉండిపో’ అనే పాటను విడుదల చేస్తున్నామని తెలుపుతూ ‘ఇస్మార్ట్ శంకర్’ టీమ్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరోయిన్ నిధి అగర్వాల్ ను రామ్ ఎత్తుకోగా నిధి చేతులు వదిలేసి గాల్లో ఉంది. నేపథ్యం బీచ్ లొకేషన్ కావడంతో పోస్టర్ అదిరిపోయింది. ఈ రొమాంటిక్ పోజు చూస్తుంటేనే పూరి జగన్నాధ్ ఈ పాటను ఏ రేంజ్ లో చిత్రీకరించాడో మనకు అర్థం అవుతోంది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పాటలన్నిటికీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈ పాట కూడా సంగీత ప్రియులను మెప్పించే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్ తో పాటు నభ నటేష్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 18 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer