వర్మ కెరీర్ గురించి ఆమెకు దిగులు

0

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు అద్బుత చిత్రాలను తెరకెక్కించాడు. సౌత్ నుండి వెళ్లిన వర్మ బాలీవుడ్ లో టాప్ స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. అమితాబచ్చన్ కు సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి బూస్ట్ ఇచ్చిన దర్శకుడు వర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వర్మ ప్రస్తుతం చెత్త పరమ చెత్త సినిమాలు చేస్తున్నాడు. ఆయన గతంలో చేసిన సినిమాలు ఇప్పటి సినిమాలు పోల్చి చూస్తే వర్మ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాని వర్మకు మాత్రం తన ఫ్లాప్స్ గురించి.. తనకు ఎదురవుతున్న డిజాస్టర్స్ గురించి ఆలోచన లేదు.

తాజాగా హీరోయిన్ ఇషా కొప్పికర్ మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కెరీర్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన హిందీలో మొదటి హర్రర్ చిత్రాన్ని తెరకెక్కించిన వ్యక్తి. ఆయన తెరకెక్కించిన రాత్రి అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమాను చూశాను. యాక్షన్.. రొమాన్స్.. హర్రర్ ఇలా అన్ని జోనర్ లలో కూడా సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు ఆయన. కాని ఇప్పుడు ఎందుకో ఆయనకు బ్యాడ్ టైం నడుస్తోంది.

ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాడ్ టైం అనేది వస్తుంది. ప్రస్తుతం అది వర్మకు నడుస్తోంది. ఆయన ఈ బ్యాడ్ టైం నుండి త్వరలోనే బయట పడతాడని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఆయన మళ్లీ మునుపటిలా అద్బుతమైన చిత్రాలను తెరకెక్కిస్తాడనే నమ్మకం ఉంది అంటూ ఇషా కొప్పికర్ ఆశాభావం వ్యక్తం చేసింది. వర్మ తెరకెక్కిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తోంది. నటనకు గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న ఇషా కొప్పికర్ వర్మ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది.

ఈ వెబ్ సిరీస్ అద్బుతంగా ఉందని.. వర్మ దర్శకత్వంలో నటించడం చాలా సంతోషంగా ఉందంటూ ఇషా కొప్పికర్ చెప్పుకొచ్చింది. వర్మ కెరీర్ గురించి ఈ అమ్మడు ఆవేదన వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యింది. వర్మ కెరీర్ గురించి ఆయనకే దిగులు లేదు. నీకు అంత బాధ ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-