ఈషా రెబ్బా వైబ్రేటర్ సీన్ వర్కవుటైందా?

0

నలుగురు దర్శకులు .. నాలుగు కథలు.. అన్నీ ఒక సిరీస్ గా.. ఇలాంటి ప్రయోగాలు వెబ్ సిరీస్ తో సాధ్యమవుతోంది. ఈ కోవలోనే లస్ట్ స్టోరీస్ వచ్చి సంచలనమైంది. ఓటీటీ వేదికపై తొలి బ్లాక్ బస్టర్ హిందీ సిరీస్ ఇదేనని చెప్పొచ్చు. ఈ హిందీ వెబ్ సిరీస్ ను కరణ్ జోహార్- జోయా అక్తర్- అనురాగ్ కశ్యప్- దిబాకర్ బెనర్జీ వంటి దిగ్గజాలు దర్శకత్వం వహించారు. `లస్ట్ స్టోరీస్` డిజిటల్ స్ట్రీమింగులో విడుదలైనప్పుడు రకరకాల అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. అందులో మాస్టర్ బేషన్ .. లేడీ స్వేచ్ఛ.. స్మోకింగ్ వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆయా సన్నివేశాల్ని ఎంతో సహజంగా తీర్చిదిద్దిన తీరు వాటిలో చెప్పదలచిన ఎంటర్ టైనింగ్ బోల్డ్ స్టోరీస్ వీక్షకులకు బాగా నచ్చాయి. వాస్తవికతకు దగ్గరగా ఉండటం చాలా మందిని ఆకట్టుకుంది.ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రీమేకైంది. టాలీవుడ్ అగ్ర తారలు ప్రధాన పాత్రలలో నటించారు. నాలుగు ఎపిసోడ్స్ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని తెలిసింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఎపిసోడ్లలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ప్రధాన పాత్ర పోషించింది. హిందీ వెర్షన్ లో కియారా అద్వానీ పోషించిన పాత్రను ఈషా రెబ్బా ఇక్కడ పోషించింది. కియరా ఎలా తన బోల్డ్ పెర్ఫామెన్స్ తో రక్తి కట్టించిందో అదే తీరుగా ఈషా రెబ్బా తన నటనతో కట్టి పడేయనుందిట. డేరింగ్ లేడీగా రెబల్ గాళ్ గా ఈషా రెబ్బా అద్బుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో జీవించేసిందని గుసగుస.

ఇక ఇందులో కియరా తరహాలోనే వైబ్రేటర్ సీన్ ని అంతే డేరింగ్ గా చేసిందా లేదా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగుకి రానుంది. నెట్ ఫ్లిక్స్.. రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఒరిజినల్ హిందీ వెర్షన్ ని మించి తెలుగు లస్ట్ స్టోరీస్ రక్తి కట్టిస్తుందని ఇంతకుముందు ప్రచారమైంది. అంతేకాదు.. హిందీ కథలకు భిన్నమైన కథల్ని చూపిస్తామని నందిని రెడ్డి అనడం ఆసక్తిని రేకెత్తించింది.
Please Read Disclaimer