టబు ఆంటీ మిర్చిలా యమ ఘాటు అనేశాడు

0

ధడక్ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన ఇషాన్ ఖత్తర్ నటుడిగా బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీతో రొమాన్స్ చేసి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం `ఏ సూటబుల్ బోయ్` అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో టబు సీదాబాయ్ అనే వేశ్య రోల్ పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్ హీట్ పెంచింది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇషాన్-టబు ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు యూత్ లో అగ్గి రాజేయడం ఖాయమనే బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఇషాన్ వయసు 24. టబు వయసు 48. అంటే ఆల్మోస్ట్ డబుల్ వయసు ఉన్న టబు తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రల మధ్య రొమాన్స్.. ఎమోషనల్ కంటెంట్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. `విక్రమ్ సేతు` అనే నవల ఆధారంగా దీన్ని మీరా నాయర్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విశేషాలను ఇషాన్ మీడియాతో పంచుకుంటూ టబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. టుబు ఆంటీకీ నేను వీరాభిమానిని. ఆంటీతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ.. ఐయామ్ లక్కీ అనేశాడు చురుకైన కుర్రాడు. ఎదుటివారు ఎలాంటి వారినైనా తన అందంతో మంత్రముగ్దుల్ని చేయగలదు. అలాగే టబు మిర్చిలా యమ ఘాటుగా ఉంటుందని ఘాటైన కామెంట్ నే చేసాడు.

రొమాన్స్ లో తనకు తానే పోటీ అని.. ప్రేమికుడు పాత్రలో ఒదిగిపోయానన్నదే నా ఫీలింగ్ అంటూ కుర్రహీరో నవ్వేసాడు. అంతే కాదు టబును తబాస్కో అనే ఓ ముద్దు పేరు కూడా పెట్టి..ఇకపై తనని ఆ పేరుతోనే పిలుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇషాన్ వ్యాఖ్యలు టబు అభిమానులకు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు. ఇషాన్ వయసుకు మించిన మాటలు మాట్లాడని కొంత మంది కామెంట్లు పెడుతున్నారు.
Please Read Disclaimer