భార్యను కొట్టినందుకు ఆ నటుడ్ని అరెస్ట్ చేశారు

0

రీల్ లో ఏదైనా చేసేయొచ్చు. ఎందుకంటే అదంతా ఉత్తుత్తినే. రీల్ కు భిన్నమైంది రియల్ లైఫ్. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా.. ఆచితూచి అన్నట్లు వేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదురైంది బుల్లితెర నటుడికి. కట్టలు తెగిన ఆవేశం.. అంతకు మించిన ఆగ్రహంతో భార్యను ఇష్టారాజ్యంగా కొట్టేసి.. తీవ్రంగా గాయపర్చిన ఉదంతంలో బుల్లితెరనటుడ్ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమాన్మయూర్.. ఎల్ బీ రోడ్డులో నివాసం ఉండే బుల్లితెర నటుడు ఐశ్వర్య రఘునాథన్. అతగాడు టీవీ నృత్య దర్శకురాలు జయశ్రీను పెళ్లాడారు. అయితే.. వీరి కాపురంలో డబ్బు చిచ్చు రేపింది. భార్యకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లను తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

దీంతో.. భార్యభర్తలిద్దరి మధ్యా గొడవ పడేవారు. అదేరీతిలో తాజాగా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరిగింది. కట్టలు తెగిన ఆగ్రహంతో భార్య జయశ్రీని ఇష్టారాజ్యంగా కొట్టేశాడు నటుడు ఐశ్వర్. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

తన భర్త తనను ఇష్టారాజ్యంగా కొట్టటంపై ఆమె పోలీసుల్నిఆశ్రయించారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ను తీసుకున్న ఆడయార్ పోలీసులు భర్త ఐశ్వర్ పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా బుల్లితెర నటుడ్ని.. అతగాడి తల్లిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.
Please Read Disclaimer