‘ఐటెం సాంగ్’లో ఇస్మార్ట్ హాట్ బ్యూటీ..!

0

నిధి అగర్వాల్. ముంబైలో సెటిల్ అయిన ఈ హైదరాబాదీ గ్లామర్ డాల్. 2017లో విడుదలైన ‘మున్నా మైకెల్’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే డ్యాన్సింగ్ సెన్సేషన్ టైగర్ ష్రాఫ్ తో కాలు కదపడంతో అందరి దృష్టిలో పడింది. ఆ సినిమాలో నిధిని చూసిన ప్రతి ఒక్కరు అదిరిపోయిందిరా.. అనుకున్నారు కానీ అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. ఇక బాలీవుడ్ లో లాభం లేదని ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో నాగచైతన్య సరసన తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అమ్మడు కాస్త టైం తీసుకొని అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో కన్పించింది. అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

తెలుగులో ఇస్మార్ట్ శంకర్ తో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా ఉండిపో లాంటి సాంగ్స్ లో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. తన కెరీర్లో ఐటమ్ సాంగ్స్ చేయనని పూనుకున్న నిధి జిల్లెలమ్మ జిట్టా సాంగ్ తో ఐటెం గర్ల్ కంటే ఎక్కువ పేరును సంపాదించుకుంది. ఇక ఆ పాటలో ఆమె హాట్ హాట్ లుక్స్ మతిపోగోట్టే డ్రెస్సింగ్ స్టైల్ ప్రేక్షకులను హీటెక్కించే డాన్స్ మూమెంట్స్ ఇలా అబ్బో.. థియేటర్లలో పెద్ద పరువాల ధారనే కురిపించింది.

ఐటెం సాంగ్స్ కోసం కోట్లు వెచ్చించైనా హీరోయిన్లను ఒప్పించే బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయడానికి నిధితో సంప్రదింపులు జరిపాడట. ఐటెం సాంగ్ కి నిధి మాత్రమే కావాలని ఎంత ఖర్చైనా ఆమెను ఓకే చేయించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. నిధికి ఇంటరెస్ట్ లేకపోయినా ఆఫర్ టెంప్టింగ్ గా ఉండేసరికి ఓకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని కుదిరితే ఇద్దరు ఇస్మార్ట్ భామలతో తెరమీద చిందేయనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. చూడాలి మరి గ్లామరస్ హాటీ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-