పవన్ కల్యాణ్ 27 ఇస్మార్ట్ బ్యూటీ జాక్ పాట్?

0

భారీ కాన్వాసుపై సినిమా తీయడం అంటే ఆషామాషీనా? అందునా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో హిస్టారికల్ సినిమా చేయడం అంటే బడ్జెట్ల పరంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫైనాన్షియర్లు అండర్ ప్రొడక్షన్ లో భారీ మొత్తాల్ని సమకూర్చినా చివరిగా నిర్మాతనే ఆ బరువు బాధ్యతల్ని మోయాల్సి ఉంటుంది. అప్పులన్నీ తిర్చి సినిమాని రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం PSPK 27 పై ఆ తరహాలోనే ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ సినిమాకి దాదాపు 150 కోట్ల మేర బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని ఇందులో 50 కోట్ల మేర ప్యాకేజ్ కింద కేవలం పవన్ చేతికే వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఇక ఇతర కాస్టింగ్ భారం కూడా పెద్దగానే ఉంటుందన్న విశ్లేషణ సాగుతోంది. ఈ సినిమాలో పవన్ సరసన నాయికలుగా పలువురు బాలీవుడ్ భామలు నటిస్తారన్నప్రచారం సాగింది. సోనాక్షి సిన్హా లేదా జాక్విలిన్ ని బరిలో దించాలని తొలుత క్రిష్ భావించారట. కానీ నిర్మాత ఏ.ఎం.రత్నంపై అంతకంతకు భారం పెరగడంతో ఇప్పుడు కాస్ట్ కటింగ్ కోసం ప్రయత్నిస్తున్నారన్న గుసగుసా వినిపిస్తోంది.

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రిలీజయ్యే వరకూ అణా పైసా తీసుకోనని నిర్మాత రత్నంకి మాటిచ్చారట. అందుకు ప్రతిగా పవన్ కి ఏరియా హక్కులు.. లాభాల్లో వాటాలు ఇస్తానని రత్నం అంగీకారం కుదుర్చుకున్నారని ప్రచారమైంది. 40 కోట్లు అంతకుమించి పవన్ కి కిట్టుబాటు అవుతుందన్న లెక్కలు రివీలయ్యాయి. తాజాగా కథానాయికల పారితోషికాల పరంగానూ కాస్ట్ కంట్రోల్ ఉండాలని దర్శకనిర్మాతలు భావించారట. ఆ క్రమంలోనే సోనాక్షి రేంజు స్టార్లు కాకుండా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో సరిపెట్టుకునే ఆలోచన చేశారట. కారణం ఏదైనా నిధి అగర్వాల్ కి పవన్ సరసన జాక్ పాట్ తగిలినట్టేనని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ అతిధి పాత్రకు ప్రగ్య జైశ్వాల్ పేరును పరిశీలించారని ఇదివరకూ వార్తలొచ్చాయి. ఇస్మార్ట్ భామ నిధి ప్రస్తుతం కాల్షీట్లు సర్ధుబాటు చేసి అంగీకారం తెలపాల్సి ఉందట. అయితే పవన్ ఏజ్ దృష్ట్యా నిధి చిన్న పిల్ల అవుతుందేమోనన్న సందేహాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక పీఎస్ పీకే 27 ఫైనాన్షియర్లకు చెల్లించాల్సిన మొత్తాల కోసం డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ ని వారికే దఖలు పర్చడం ద్వారా ఆ మేరకు నిర్మాతపై భారాన్ని తగ్గించదలిచారట.
Please Read Disclaimer