ఇస్మార్ట్ హీరో.. ఇస్మార్ట్ సెంటిమెంట్

0

వెతికితే ఈ దేశంలో ఆయింట్మెంట్లు లేని ఇల్లైనా కనిపిస్తుందేమో కానీ సెంటిమెంట్లు లేని ఇల్లు కనిపించదు. అందుకే ఎవరో విదేశీయులు మనల్ని చులకనగా ‘ఇండియన్స్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్’ అన్నారట. వారి ఉద్దేశం సెంటిమెంట్స్ ఉండే ఫూల్స్ అనా.. లేక సెంటి- మెంటల్ ఫూల్స్ అనా? ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనలో చాలామందికి సెంటిమీటర్ అయినా మెంటల్ ఉంటుంది కదా? ఇదంతా గ్రహించే మనల్ని అలా అన్నారేమో.

సరే ఎవరు ఎన్ని చెప్పినా మనలో చాలామందికి సెంటిమెంట్స్ ఉన్నాయి. నిజానికి నాకు ఏ సెంటిమెంట్ లేదు అని గట్టిగా వాదించే కొందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే “ఏం సెంటిమెంట్ లేకుండా ఉండాలనుకోవడం.. అందుకు పట్టుబట్టడం” కూడా ఒక సెంటిమెంటే కదా. సరే ఇలాంటి తికమక లాజిక్కులు పక్కన పెడితే ఇండస్ట్రీలో చాలామందికి సెంటిమెంట్లు ఉన్నాయి. అవన్నీ పైకి చెప్పరు కానీ గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా ఈ లిస్టులోకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా జాయిన్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

చాలా రోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రామ్ కు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ హిట్టును తీసుకొచ్చింది. ఈ సినిమాతో రామ్ ఒక్కసారిగా మిడ్ రేంజ్ హీరోలలో తన సత్తా చాటాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో రామ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం గోవాలో ఇరవై రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను కొన్ని కీలకమైన సీన్లను గోవాలో చిత్రీకరించారని.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ గా ‘రెడ్’ సినిమాకు గోవా షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాధ్ వల్లే ఈ గోవా సెంటిమెంట్ రామ్ కు వచ్చిందని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరి గోవా సెంటిమెంట్ రామ్ కు మరోసారి వర్క్ అవుట్ అవుతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer