ఇస్మార్ట్ ఒంపు సొంపులు

0

నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నభ నటేష్ మొదటి సినిమాతోనే అందం మరియు అభినయంతో మెప్పించింది. ఆ సినిమాలో నభా నటన మెప్పి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో ఒక డాషింగ్ పాత్రను ఇచ్చాడు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి ఇస్మార్ట్ బ్యూటీ అనిపించుకుంది నభా నటేష్. ఆ సినిమాతో వెంటనే రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. త్వరలో డిస్కో రాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడితో పలువురు ఫిల్మ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించబోతున్న ఫైటర్ లో కూడా ఈమె ఒక హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈమె సినిమాలు ఏవీ ఓకే కాలేదు కాని ఈమె వచ్చే ఏడాది పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించడం కన్ఫర్మ్ అనిపిస్తుంది.

ఇటీవల ఈ అమ్మడు తన ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోసారి నభా నటేష్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో చాల ట్రెండీగా ఈ ఫొటోల్లో కనిపిస్తుంది. చీరను ఈ అమ్మడు విభిన్నంగా కట్టినట్లుగా ఉంది. చీరకట్టులో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక రకం ఈ అమ్మడు ప్రయత్నించింది. సహజంగానే చీర కట్టులో అమ్మాయిలు అందంగా కనిపిస్తారు. ఇక నభా వైవిధ్యంగా చీర కట్టడంతో మరింతగా ఒంపు సొంపులు కనిపిస్తూ ఉన్నాయి. తన అందంతో నెటిజన్స్ ను కట్టి పడేస్తోంది.
Please Read Disclaimer