ఇస్మార్ట్ బ్యూటీ ఇంత లో అంత ఎదిగి పోయిందే

0

అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ లతో సినిమాలు చేసిన నిధి అగర్వాల్ కు సక్సెస్ అనేది దక్కలేదు. కాని గత ఏడాది పూరి దర్శకత్వంలో రామ్ తో కలిసి చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి అగర్వాల్ క్రేజ్ ఒక్క సారిగా పెరిగింది. అందుకు ముందు వరకు చాలా తక్కువ పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తన పారితోషికానికి మూడు రెట్లు పెంచిందనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో కలిపి మూడు నాలుగు సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్న నిధి అగర్వాల్ ఇటీవల ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఆ కారుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో షేర్ చేసుకుని తన కొత్త కారు ఆనందాన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. హలో బ్యూటీ.. నీకు ఈ దశాబ్దంలోకి స్వాగతం అన్నట్లు గా కారును వెల్ కం చేసింది.

నిధి అగర్వాల్ చేసింది కొన్ని సినిమాలే అయినా అప్పుడే ఇంత ఖరీదైన కారను ఈ అమ్మడు కొనడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు హీరోయిన్స్ రెండు మూడు సినిమాలతో గుర్తింపు దక్కించుకుని ఈవెంట్స్ అని.. బ్రాండ్స్ కు ప్రమోషన్స్ అని బాగానే సంపాదిస్తున్నారు. దాంతో ఇలా ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కూడా ఇంతలోనే అంత ఖరీదైన కారు కొనడంకు కారణం ఆమె సంపాదనే అని చెప్పుకోవచ్చు.
Please Read Disclaimer