ఇది సినిమానేనా హీరోగారు ?

0

మూడు రోజుల క్రితం తన సినిమాను కాపీ కొట్టి పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తీశాడని చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని మాజీ హీరో ఆకాష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ్ వెర్షన్ ఇంతకు ముందే విడుదలయిందని తెలుగులో కొత్తగా ఉన్నాడు పేరుతో డబ్ చేసి వదిలే లోపే ఇస్మార్ట్ శంకర్ తీశారని వాపోయాడు. అప్పుడెప్పుడో ఆనందం లాంటి సెన్సిబుల్ లవ్ బ్లాక్ బస్టర్లో నటించాడన్న సానుభూతి మీడియాలో ఉండటంతో అతను చెప్పినవన్నీ విని రాసుకున్నారు.

ఇప్పుడా కొత్తగా ఉన్నాడు ట్రైలర్ వచ్చింది. నిజానికి తమిళ్ సినిమానే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. నాసిరకం మేకింగ్ తో పాటు ఎవరో పనితెలియని వాడితో చేయించినట్టు అనిపించే ఎడిటింగ్ ఇంటర్ నెట్ కేఫ్ లో కూర్చుని గ్రాఫిక్ వర్క్ చేశారా అని అనుమానం వచ్చేలా ఉన్న టేకింగ్ వెరసి ఇవన్నీ తీవ్రమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేలా చేశాయి. ఇప్పుడీ కళాఖండం తెలుగులోకి వస్తోంది

ఆకాష్ అన్నాడని కాదు కానీ కథ పరంగా మెదడులో మెమరీ మారడం అనే పాయింట్ కొంచెం దగ్గరికి అనిపిస్తోంది కానీ మిగిలినదంతా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. యాక్టింగ్ మర్చిపోయిన ఆకాష్ ఎక్స్ ప్రెషన్స్ హీరోయిన్ ఎక్కడ అని వెతికేలా ఉన్న అమ్మాయి హావభావాలు షార్ట్ ఫిలిం కన్నా కింది స్థాయిలో అనిపించే యాక్షన్ విజువల్స్ వెరసి ఈ కొత్తగా ఉన్నాడు కాస్తా వింతగా ఉన్నాడు అనిపించేలా ఉంది.

ఫైవ్ డి కెమెరా వాడినా కూడా ఇంత తక్కువ నాణ్యత ఉండడేదేమో. ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్స్ సెల్ ఫోన్ తో షూట్ చేసినట్టు ఉన్నాయి. ఈ మాత్రం దానికా ఇంత హడావిడి అనిపించేలా ఉన్న ఈ కొత్తగా ఉన్నాడు ఏ దశలోనూ ఆ ఫీలింగ్ కలిగించలేకపోయాడు. పూరి టీం ఇది చూసిందంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడం ఖాయం
Please Read Disclaimer