ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికి వారం అయింది. ఈ వారం రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ పాతిక కోట్ల షేర్ మార్క్ దాటింది. రామ్ కెరీర్ లో రూ.25 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమా ఇదే.

వారం రోజులకు గానూ ‘ఇస్మార్ట్ శంకర్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.25.24 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్మార్ట్ హీరో రూ. 27.71 కోట్లు కొల్లగొట్టాడు. మొదటి వీకెండ్ ను ఫుల్ గా వాడుకుని మంచి కలెక్షన్స్ నమోదు చేసిన ఈ చిత్రం వీక్ డేస్ లో మాత్రం నెమ్మదించింది. మల్టిప్లెక్సులలో ఆక్యుపెన్సీ తగ్గినా సింగిల్ స్క్రీన్స్ లో.. బీ సి సెంటర్లలో కలెక్షన్స్ నిలకడగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలవారి సమాచారం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.17 కోట్లకు పైగా జరిగింది. దీంతో ఇప్పటికే సినిమా నిర్మాతలు.. బయ్యర్లు లాభాల్లోకి వచ్చారు. అయితే సినిమా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఈ వారంలో భారీ అంచనాల మధ్య ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ అవుతోంది కాబట్టి ‘ఇస్మార్ట్ శంకర్’ కు గట్టి పోటీ తప్పదు.

ప్రపంచవ్యాప్తంగా ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి వారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 10.98 cr

సీడెడ్: 4.21 cr

ఉత్తరాంధ్ర: 2.96 cr

కృష్ణ: 1.61 cr

గుంటూరు: 1.69 cr

ఈస్ట్ : 1.60 cr

వెస్ట్: 1.35 cr

నెల్లూరు: 0.84 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 25.24 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.57 cr

ఓవర్సీస్: 0.90 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 27.71 cr
Please Read Disclaimer