డబుల్ ఇస్మార్ట్ ఖాయం చేశారుగా!

0

చాలా గ్యాప్ తర్వాత ఎనర్జిటిక్ రామ్ కి .. స్పీడ్ డైరెక్టర్ పూరీకి సరైన బ్లాక్ బస్టర్ పడింది. ఇస్మార్ట్ శంకర్ ఈ ఇద్దరి ఆకలి తీర్చేసింది. 2019 ఈ ఇద్దరికీ కలిసొచ్చిన సంవత్సరం. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ బెస్ట్ కాగా.. పూరీకి ఎంతో సంతృప్తిని మిగిల్చిన సినిమా. ఆయన బ్రాండ్ కి వ్యాల్యూ ఏమాత్రం తగ్గలేదని రిజల్ట్ చెప్పింది. దాదాపు 36కోట్ల షేర్ 72కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే సీక్వెల్ పై పూరి- రామ్ విడివిడిగా పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇచ్చారు. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అన్న టాక్ రాగానే వెంటనే సీక్వెల్ ని ప్రకటించేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. అప్పటికే పూరి స్క్రిప్టు విని విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడు. దాంతో రామ్ తిరిగి తన ఫేవరెట్ కిషోర్ తిరుమలతో రెడ్ (తడం రీమేక్) స్క్రిప్టు వినే పనిలో పడ్డాడు. ఈ రెండు సినిమాల ప్రకటనలు వెంట వెంటనే వెలువడడం.. చిత్రీకరణల హడావుడిలో ఉండడం తెలిసిందే.

పూరీతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ ఉంటుంది. అయితే స్క్రిప్టు రెడీ అవ్వాల్సి ఉందని ఇంతకుముందే రామ్ ఫుల్ క్లారిటీనిచ్చారు. అలాగే పూరీ కూడా దీనిపై క్లారిటీతోనే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్లినా `ఇస్మార్ట్ శంకర్` సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించి.. ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం `డబుల్ ఇస్మార్ట్` అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాను అని పూరి తెలిపారు. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ 2020లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పూరి నిర్మాతగా తన వారసుడు ఆకాశ్ తో రొమాంటిక్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. స్వీయ దర్శకత్వంలో రౌడీతో ఫైటర్ కి రెడీ అవుతున్నాడు. ఇవి రెండూ 2020 ప్రథమార్థం నాటికే ఫుల్ క్లారిటీనిచ్చేస్తాయి కాబట్టి అటుపై రామ్ `డబుల్ ఇస్మార్ట్` స్క్రిప్టుపై పూర్తిగా దృష్టి పెడతాడన్నమాట. అప్పటికి రామ్ కూడా రెడ్ చిత్రీకరణను పూర్తి చేసి రెడీ అవుతాడు.
Please Read Disclaimer