స్మార్ట్ హిట్ కొడితే బాలయ్య ఆఫర్ ?

0

దర్శకుడు పూరి జగన్నాధ్ కి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కెరీర్ పరంగా లైఫ్ అండ్ డెత్ గేమ్ అయిపోయింది. ఎప్పుడూ చూడని ఊరమాస్ రామ్ అవతారం గురించి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం పట్ల అభిమానుల్లో కొంత టెన్షన్ ఉన్నప్పటికీ ఫైనల్ గా ఔట్ ఫుట్ అదిరిపోయిందన్న మాట యూనిట్ నుంచి వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ కు ముందు ఈ మాత్రం నమ్మకం అందరూ వ్యక్తం చేసేదే కాబట్టి దీన్నే పరిగణనలోకి తీసుకోలేం కాని ముందైతే సక్సెస్ కొట్టి చూపించాల్సిన బాధ్యత పూరి మీదుంది. దీనికి మరో కారణం కూడా ఉంది.

పైసా వసూల్ విడుదలకు ముందు పూరితో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చిన బాలయ్య దాని రిజల్ట్ చూశాక సైలెంట్ అయ్యాడు. పూరి కూడా ఏమి అడగలేని పరిస్థితి. ఇప్పుడు బోయపాటిది హోల్డ్ లో పడి కెఎస్ రవికుమార్ ది మాత్రమే సెట్స్ పైకి వెళ్లనుండటంతో మరోసారి బాలయ్య ముందు పూరి ప్రపోజల్ పెట్టాడట. అయితే ఇస్మార్ట్ శంకర్ ఆడితేనే ఆలోచిస్తానని బాలకృష్ణ చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్.

ఇదే ఫార్ములా బోయపాటికు కూడా వర్తించింది. వినయ విదేయ రామకు ముందు పక్కా కమిట్మెంట్ ఇచ్చిన బాలయ్య దాని డిజాస్టర్ రిజల్ట్ తో పాటు బోయపాటి శీను భారీ పెట్టించిన బడ్జెట్ కూడా కళ్ళముందు కనిపించడంతో వేరే కథతో చేద్దామని పెండింగ్ లో పెట్టేశాడు. అసలు అది ఎప్పుడు ఉండబోతోందో కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ కనక హిట్ అయితే పూరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. తేడా కొడితేనే కష్టం. పైసా వసూల్ తర్వాత మరోసారి బాలయ్యతో జట్టు కట్టాలన్నా ఇస్మార్ట్ శంకర్ తో పూరి ఋజువు చేసుకోవాల్సిందే.
Please Read Disclaimer