ఇష్.. ఇష్.. ఇస్మార్టుగా టైటిల్ సాంగ్!

0

పూరి జగన్నాధ్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే ‘దిమాక్ ఖరాబ్’.. ‘జిందాబాద్ జిందాబాద్’ అనే రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు. మొదటిది పక్కా మాస్ సాంగ్ కాగా రెండోది రొమాంటిక్ సాంగ్. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు.

సహజంగా టైటిల్ సాంగ్ అంటేనే హీరో పాత్ర.. ఆయన టాలెంట్ గురించి వివరిస్తూ సాగుతుంది. ఈ పాట కూడా అదే స్టైల్లో ఉంది. సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటకు మాంచి ఊపుండే ట్యూన్ ను కంపోజ్ చేశారు. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు భాస్కరభట్ల. హీరో ఫుల్ మాస్ కాబట్టి.. ఆ పాత్ర చిత్రణను ను తెలుపుతూ తెలుగు.. హైదరాబాదీ హిందీ కలిపిన మాస్ పదాలతో సాహిత్యం అందించారు “గడబిడలకు బేఫికర్ సడక్ సడక్ కడక్ పొగర్ ఇస్టైల్ దేఖో నీచే ఊపర్ ఇష్ ఇష్ ఇష్మార్టు.. నామ్ బోలెతో గల్లీ హడల్.. డబల్ దిమాక్ ఉంది ఇధర్ కర్లే అప్ని నీచే నజర్” అంటూ సాగింది. ఈ లిరిక్స్ కు తగ్గట్టు మంచి జోష్ లో అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడడం జరిగింది. ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన వారు జానీ మాస్టర్. ఓవరాల్ గా ఈ సాంగ్ మొదటిసారే మ్యూజిక్ లవర్లకు కనెక్ట్ అవుతుంది. రెండో మూడు సార్లు వింటే అడిక్ట్ కావడం ఖాయమే. ఆలస్యం ఎందుకు.. జల్దీ జల్దీ సునో జీ!

ఈ సినిమాలో రామ్ సరసన నభ నటేష్.. నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాధ్.. ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జులై 12 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer