స్వర్గ లోకంలో తాప్సీ వీరవిహారం చూశారంటే షాకే

0

అదేదో సినిమా సెట్టింగులా… అసలు ఆ ప్లేస్ చూస్తుంటేనే స్వర్గంలా అనిపిస్తోంది. బులుగు జిలుగు బీచ్ పరిసరాల్లో స్విమ్మింగ్ పూల్ స్నానాలతో గత కొద్దిరోజులుగా తాప్సీ ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు. అయితే ఈ స్వర్గం ఎక్కడ ఉంది? అంటే.. మాల్దీవుల్లో స్పెషల్ ప్లేస్ అని చెబుతోంది ఈ అమ్మడు. ఇక మాల్దీవులు వెళ్లింది మొదలు తాప్సీ ఒంటిపై టూపీస్ తప్ప ఇంకే వస్త్రాలు లేవ్.

బికినీలో జిల్ చిల్ అంటూ ఒకటే అదరగొట్టేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాజాగా ఈ సిరీస్ ఫోటోల్లో స్పెషల్ ఫోటోని తాప్సీ రిలీజ్ చేసింది. గాల్లో ఎగురుతూ గంట కొట్టేందుకు ప్రయత్నిస్తోంది అమ్మడు. సంథింగ్ హాట్ అండ్ స్పైసీ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

మరోవైపు పాయల్ తో వివాదం విషయంలోనూ స్నేహితురాలు రిచా చద్దాకు తాప్సీ బాసటగా నిలుస్తోంది. అనురాగ్ కశ్యప్తో లైంగిక వేధింపుల విషయంలో తన పేరును లాగడంతో రిచా చద్దా ఇటీవల పాయల్ ఘోష్పై పరువు నష్టం దావా వేసింది. చద్దా జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి ఎన్సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. స్పందన పొందడంలో విఫలమైన నటి ట్విట్టర్లోకి తీసుకెళ్లి తన ఫిర్యాదు వివరాలను కోరుతూ శర్మను ట్యాగ్ చేసింది.

శుక్రవారం సాయంత్రం.. రిచా తన ట్వీట్ వార్ ను కొనసాగిస్తూ…. ఘోష్ పై విమర్శలు గుప్పించింది. రిచా ట్వీట్ కు ప్రతిస్పందిస్తూ తాప్సీ పన్నూ పరిస్థితిని పరిశీలించింది. “మీరు కనిపించి మరియు వినిపించేలా దిల్లీకి వెళ్లాలని నేను భావిస్తున్నాను“ అని తాప్సీ తనకు మద్ధతు పలికింది. “రాతపూర్వక ఫిర్యాదుతో పాటు ఫోటో ఆప్ తప్పనిసరి అని ఎన్.సిడబ్ల్యు వెబ్ సైట్ పేర్కొన్నట్లయితే నేను కూడా అదే చేసేదానిని. మహిళల కోసం ‘జాతీయ’ కమిషన్. నా ఫిర్యాదు రసీదు స్క్రీన్ షాట్ ఇదిగో“ అంటూ చూపించింది. మొత్తానికి పాయల్ ఘోష్ ఆరోపణకు వ్యతిరేకంగా రిచా చద్దాకు తాప్సీ మద్ధతుగా నిలవడమే గాక జాతీయ మహిళా కమీషన్ తో టచ్ లో ఉండమని ఫ్రెండు రిచాకు సూచించిందన్నమాట.