బాలీవుడ్ జంట క్వారంటైన్ అయిందా…?

0

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికే భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకు వెళ్తున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. పైగా విదేశాల నుంచి వచ్చిన వారు రెండు వారాల పాటు గృహ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశించాయి. దాంతో విదేశాల నుండి వచ్చిన వారంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు సూచిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సామాజిక అంశాలపై స్పందించడానికి ఎప్పుడూ ముందుండే ప్రియాంకా చోప్రా కూడా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు చెబుతూ తాజాగా కొన్ని వీడియోలు విడుదల చేసింది. ఈ వీడియోల ద్వారా తన భర్త నిక్ జోనస్ తో కలిసి 8 రోజులుగా సెల్ఫ్ ఐసొలేషన్ పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఎప్పుడూ చుట్టూ జనాలతో ఉండే నా ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులై కేజ్రీగా మారిపోయిందని తెలిపింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజకుమార్ రావుతో కలిసి ‘ది వైట్ టైగర్’లో మరియు ‘సంగీత్ ప్రాజెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-