ఐటీ సోదాల్లో NEXT జాబితా ఇదే

0

బుధవారం జరిగిన ఐటీ దాడులతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సురేష్ బాబు- వెంకటేష్- నాగార్జున- నాని- సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ లపై ఉన్నట్లుండి ఆకస్మికంగా ఊహించని దాడులు జరిగాయి. ఇంకా పలు నిర్మాణ సంస్థలపై దాడులు జరిగినట్లు అనధికారిక సమాచారం. ఆడిటర్లను దగ్గర పెట్టుకుని లెక్కలన్నింటిపైనా అధికారులు ఆరాలు తీసారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర రూమర్ వెలుగులోకి వచ్చింది. తొలి ధపాగా పలువురు సెలబ్రిటీ ఇళ్లపై దాడులు చేసిన అధికారులు నెక్స్ట్ లిస్ట్ లో మరికొంత మంది సెలబ్రిటీలను టార్గెట్ చేసినట్లు సమాచారం అందుతోంది.

దీనిలో భాగంగా కొంత మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- హారికా హాసిని క్రియేషన్స్-14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్- ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అనీల్ సుంకర్ పేర్లు సెకెండ్ లిస్ట్ లో ఉన్నాయంటూ ఓ రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాయి. అన్నీ లాభాల బాటలోనే ఉన్నాయి. అందుకే అటువైపు ఐటీ కన్ను ఉందని తెలుస్తోంది.

ఇక మహేష్ వరుస విజయాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. ఇటీవలే ఎఎంబీ మాల్ కమ్ మల్టీప్లెక్స్ ను నిర్మించాడు. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన లో బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు లో మహేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు- అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బడా నిర్మాతల ఇద్దరి పేర్లతో పాటు.. మహేష్ పేరు ఈ లిస్ట్ లో ఉన్నట్లు ఓ రూమర్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోన్న అలవైకుంఠపురములో చిత్రంలో నటిస్తోన్న నేపథ్యంలో ఆ ఇరువురిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారని ప్రచారం సాగుతోంది.
Please Read Disclaimer