150 కోట్లకు పన్ను ఎగ్గొట్టానని అంగీకారం

0

జీఎస్టీ అధికారుల వేటలో ప్రముఖ తమిళ నిర్మాత కం ఫైనాన్షియర్ అన్బు చెజియాన్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇలయదళపతి విజయ్ కి ఆయనతో ఉన్న లింకులపైనా జీఎస్టీ అధికారులు ఆరాలు తీసారు. ఏక కాలంలో అన్బుకి చెందిన ఏజీఎస్ కంపెనీ కార్యాలయాలు.. అన్బు- విజయ్ ఇండ్లపైనా అధికారులు దాడులు చేసి కీలక పత్రాల్ని స్వాధీన పరుచుకున్నారు. ఇందులో రకరకాల డాక్యుమెంట్లు- ప్రామిసరీ నోట్లు .. బ్యాంక్ ఖాతాల వివరాలు వెల్లడయ్యాయి.

ఇక గత కొద్దిరోజులుగా ఇలయదళపతి విజయ్ ని .. అన్బుని జీఎస్టీ అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేంద్రం కుట్ర అంటూ విజయ్ అభిమానులు సీరియస్ అవుతున్నా అవేవీ పట్టించుకోకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అన్బు చెజియాన్ పన్ను ఎగ్గొట్టానని స్వచ్ఛందంగా అంగీకరించారని తెలుస్తోంది. దాదాపు 300 కోట్లకు సంబంధించిన విచారణలో 150 కోట్లకు పన్ను ఎగ్గొట్టానని అన్బు అంగీకరించడం సంచలనమైంది. ఆయన ఇంట్లో ఇప్పటికే 77 కోట్ల మేర కరెన్సీని ఐటీ అధికారులు సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో బంగారం సహా డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నారు.

ఇక పన్ను ఎగవేతలో ఇలయదళపతి విజయ్ పాత్ర ఎంత? అన్నదానిపైనా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. అయితే అన్బు చెజియాన్ కి కేవలం సినిమా బిజినెస్ మాత్రమే కాదు.. అటు సినిమాయేతర కంపెనీలు సహా పలు రకాల వ్యాపారాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Please Read Disclaimer