అగ్రనిర్మాత డి.సురేష్ బాబు పై ఐటీ దాడులు!

0

టాలీవుడ్ అగ్ర నిర్మాత.. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబుపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనమైంది. ఆయన కు చెందిన రామానాయుడు స్టూడియోస్ సహా కార్యాలయాల పైనా ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. నేటి ఉదయం నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో రామానాయుడు స్టూడియోస్ కార్యాలయం లో పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలన్నిటి పైనా ఏక కాలంలో దాడులు నిర్వహించి పత్రాల్ని పరిశీలిస్తున్నారు. జూబ్లీ హిల్స్లోని సురేష్ బాబు నివాసంలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియోస్ .. సురేష్ ప్రొడక్షన్స్ కి సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ ఈ ఆకస్మిక దాడులు నిర్వహించిందని చెబుతున్నారు. ఇప్పటికే సురేష్ బాబు కార్యాలయాల్లో కీలక పత్రాల్ని.. పలు హార్డ్ డిస్కుల్ని స్వాధీన పరుచుకున్న ఐటీ అధికారులు సోదాల్ని ఇంకా కొనసాగిస్తున్నారు.

పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ అమలు అనంతరం ఐటీ అధికారులు సినిమా వాళ్లపై ప్రత్యేకించి దృష్టి సారించారు. పరిణామాల్ని ప్రతిదీ క్షుణ్ణం గా పరిశీలించి ఈ తరహా దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం ఉంది. ఇక రామానాయుడు నిర్మాతగా ఉన్నంత కాలంగా వరుసగా సినిమాలు నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇటీవల రిస్కీ వెంచర్ల జోలి కి వెల్లడం లేదు. ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్- దగ్గుబాటి రానాల తో సినిమాలు చేస్తూ ఎగ్జిబిషన్- డిస్ట్రిబ్యూషన్ పైనే ఎక్కువ దృష్టి సారించారు. సేఫ్ ప్రాజెక్ట్స్ సేఫ్ గేమ్ అన్న ప్రాతిపదికన బిజినెస్ సాగుతోంది. ప్రస్తుతం వెంకటేష్- నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ సినిమాకి సురేష్ బాబు సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక సురేష్ బాబు పలువురి తో అసోసియేట్ అయ్యి సినిమాలు నిర్మిస్తూ .. చిన్న సినిమాలకు ప్రచార సాయం అందిస్తూ రిలీజ్ కి సహకరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా ఐటీ దాడుల నేపథ్యం లో సురేష్ బాబుతో అనుబంధం ఉన్న ఇతర సంస్థల కార్యాలయాలతో పాటు పలువురు హీరోలు.. దర్శకులు.. నిర్మాతల ఇళ్లపైనా ఐటీ దాడులు కొన సాగుతున్నట్టు సమాచారం. ఇక ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి లో ఐటీ సరిగా చెల్లించని పలువురు స్టార్ హీరోలు.. నిర్మాతల పేర్లు ఉన్నాయని తాజాగా ఓ సమాచారం లీకైంది.
Please Read Disclaimer