ఏసియన్ సినిమాస్ పై ఐటీ రైడ్స్

0

ఏసియన్ సినిమాస్ బ్రాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. సినిమాల పంపిణీ- నిర్మాణం.. మల్టీప్లెక్స్ థియేటర్లు.. స్థిరాస్తి రంగం.. వగైరా వగైరా వ్యాపారాల్లో ఉద్ధండులు. నైజాం- హైదరాబాద్ ఏరియా పంపిణీ రంగంలో టాప్ గేమ్ ప్లేయర్స్. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ జాయింట్ వెంచర్ ని ప్రారంభించింది. తొలిగా గచ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని ప్రారంభించారు. దీనిని దఫదఫాలుగా విస్తరించనున్నారు.

నారాయణ దాస్- సునీల్ నారంగ్ దాస్ సంయుక్తంగా ఈ వ్యాపారాలకు కర్తలుగా కొనసాగుతున్నారు. ఏసియన్ సినిమాస్ హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో అత్యంత వేగంగా విస్తరించే ప్రణాళికల్లోనూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లోని మెజారిటీ మల్టీప్లెక్స్ లో ఏసియన్ సినిమాస్ విస్తరిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఏసియన్ సినిమాస్ పై ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఏసియన్ సినిమాస్ ఆఫీస్ లు.. నారంగ్ దాస్ ఇల్లు సహా భాగస్వాముల ఇళ్లు- కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు సాగాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.