తాప్సి సినిమాకు భీమా లేదు.. అసలు షూటింగే లేదు

0

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతోంది. చాలా మంది నిర్మాతలు షూటింగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పొరపాటున యూనిట్ సభ్యుల్లో ఎవరికి అయినా పాజిటివ్ వచ్చిందంటే భారీ నష్టం తప్పదు. అందుకే షూటింగ్ కు వెళ్లకుండా ఉంటున్నారు. అయితే తాప్సి నటిస్తున్న లూప్ లపేటా చిత్రం నిర్మాత మాత్రం భీమా చేయించి ధీమాగా షూటింగ్ కు సిద్దం అవుతున్నాడు అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

లూప్ లపేటా చిత్రం షూటింగ్ ను మొదలు పెట్టి యూనిట్ సభ్యుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే నష్ట పోకుండా భీమా సంస్థ నుండి క్లైమ్ చేసుకునేలా ఇన్సురెన్స్ తీసుకున్నారనే టాక్ బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రచారం జరిగింది. కాని ఆ వార్తలన్నీ పుకార్లే అని తేలిపోయింది. మా వద్ద ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఏడాది పూర్తి అయ్యే వరకు తాప్సి ఏ సినిమా షూటింగ్ కు కూడా వెళ్లేందుకు ఆసక్తిగా లేదట. ఆమె వచ్చే ఏడాది వరకు షూటింగ్ లో పాల్గొనబోను అంటూ నిర్మాతలకు క్లారిటీగా చెప్పేసిందట.

తాప్సి నిర్ణయంతో లూప్ లపేటా చిత్రం షూటింగ్ కు భీమా.. ధీమాగా షూటింగ్ అనే వార్తలు పుకార్లే అంటూ తేలిపోయింది. అలాంటి భీమా టెక్నికల్ గా సాధ్యం కాదంటూ కొందరు ఇన్సురెన్స్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్స్ కు వెళ్లాలి అంటేనే నిర్మాతలు భయపడుతున్నారు. స్టార్స్ కూడా ఈ ఏడాదిలో అసలు షూటింగ్స్ కు హాజరు అయ్యేది లేదంటే నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు.