వీర్యం తారుమారు.. కడుపు చెక్కలయ్యే కాన్సెప్ట్

0

క్రియేటివిటీ ఉండాలే కానీ సింపుల్ కాన్సెప్టుతో లాఫింగ్ బాంబ్ పేల్చవచ్చని ప్రూవ్ చేస్తున్నారు బాలీవుడ్ లో. వీర్యదానం కాన్సెప్ట్.. బట్టతల కాన్సెప్టు.. సరోగసి కాన్సెప్ట్.. ఇంకా ఇన్నోవేటివ్ గా వెళితే ఏకంగా వీర్యం మిక్సింగ్ కాన్సెప్ట్ అంటూ బాలీవుడ్ లో చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే ఔరా! అనకుండా ఉండలేం. మెదడు టైమ్ బాంబ్ లా పని చేయాలే కానీ ఇలాంటి క్రియేటివిటీతో ఎన్నిసార్లు అయినా మ్యాజిక్ చేయవచ్చని నిరూపిస్తున్నారు యంగ్ ట్యాలెంటెడ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్.

తాజాగా అక్షయ్ కుమార్ – కరీనా.. దిల్జీత్ దోసాంజి- కియరా అద్వాణీ జంటలపై తెరకెక్కించిన `గుడ్ న్యూజ్` కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయమని నేడు రిలీజైన ట్రైలర్ చెబుతోంది. అసలు ఈ సినిమాకి ఎంచుకున్న కాన్సెప్టే ఆసక్తి పెంచేస్తోంది. రెండు జంటలు పిల్లలు పుట్టడం కోసం ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. ఆధునిక ఒత్తిళ్ల జీవనంలో సెక్స్ లైఫ్ కి దూరమైన జంటలు.. నిరంతరం బెడ్ రూమ్ లో పడే పాట్లను తెరపై చూపిస్తూనే.. చివరికి విసిగిపోయి ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు రెడీ అవుతారు. ఈ విధానంలో భర్త వీర్యం సేకరించి భార్య గర్భంలోకి ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అయితే అది కాస్తా అటూ ఇటూ తారుమారు అవుతుంది. అంటే ఒకరి గర్భంలో ప్రవేశ పెట్టాల్సినది ఇంకొకరి గర్భంలోకి ప్రవేశ పెట్టేస్తారు డాక్లర్లు పొరపాటున.

ఇంకేం ఉంది. ఆయన బిడ్డ ఈమె కడుపులో .. ఈమె బిడ్డ ఆయన భార్య కడుపులో పెరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే ఎవరి బిడ్డ కోసం వాళ్లు ఆత్రపడడం అటుపై స్నేహితులు అయిపోవడం అంతా చాలా గమ్మత్తుగానే అనిపిస్తోంది. ఇక ఇలాంటి కథని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలోనే హిలేరియస్ కామెడీ అన్నది దాగి ఉంది. పర్ఫెక్ట్ కాన్సెప్టును పట్టుకుంటే కామెడీని పుట్టించనవసరం లేదు. దానంతట అదే పుడుతుంది అనడానికి గుడ్ న్యూజ్ సినిమానే ఉదాహరణ కాబోతోంది. ట్రైలర్ తోనే అంతగా నవ్వించారు. సినిమా ఆద్యంతం చూస్తే ఇంకెంతగా పగలబడి నవ్వుతారో. ముఖ్యంగా కిలాడీ అక్షయ్ – కరీనా జోడీ మెస్మరైజింగ్ కామెడీ.. దోసాంజి- కియరా టైమింగ్ సెన్స్ అబ్బురపరుస్తున్నాయి. కరీనా కడుపులో పెరిగేది దోసాంజి బిడ్డ.. కియరా కడుపున పెరిగేది అక్షయ్ బిడ్డ అన్నదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్టు. ఇక అక్కీ ఏజ్డ్ పర్సన్ గా కనిపిస్తే దిల్జీత్ కొత్తగా పెళ్లయిన వాడిలానే ఉన్నాడు. ఇక ఈ సినిమాని థియేటర్ లో చూసి పడి పడి నవ్వడం గ్యారెంటీ. డిసెంబర్ 27న సినిమా రిలీజవుతోంది. సైలెంటుగా వచ్చి సెన్సేషనల్ హిట్టు కొట్టేట్టే కనిపిస్తోంది మరి.
Please Read Disclaimer