టైటిల్ తకరారు ఏమిటో జానూ

0

తమిళ బ్లాక్ బస్టర్ 96 ని తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శర్వానంద్-సమంత జంటగా మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ ఇక్కడా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుగారు ఎంతో ఇష్టపడి చేస్తోన్న రీమేక్ చిత్రం కూడా ఇది. జాను అనేది టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు పోస్టర్ వేసి మరీ రివీల్ చేసారు. ఈ పేరు చిత్రంలో సమంత పాత్ర పేరు. అలాగే అనుకోకుండా ప్రకటంచిన టైటిల్ కూడా. కనీసం ఎవరి ఊహకు అందని టైటిల్ ఇది. అనూహ్యాంగా ఈ టైటిల్ తెరపైకి రావడంతో జాన్ పై దాని ప్రభావం పడిందా? అంటే అవుననే ప్రచారం వేడెక్కిస్తోంది.

ఇది డార్లింగ్ నటిస్తున్న జాన్ కి సెగ పెడుతోందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. ప్రభాస్ కథానాయకుడిగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ `జాన్` అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా జాన్ ని వర్కింగ్ టైటిల్ గానే భావించారు. కానీ జనాల్లోకి ఆ టైటిల్ బలంగా వెళ్లడంతో ఆ టైటిల్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నారుట. అయితే దిల్ రాజు `జాను` టైటిల్ కారణంగా జాన్ కి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. జానుకి…జాన్ కి పెద్ద తేడా లేదు. రెండూ లవ్ స్టోరీ జానరే. ప్రభాస్ జాన్ గా వస్తున్నట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రేక్షకాభిమానులు సాహో తర్వాత జాన్ అనే ఫిక్సయిపోయారు.

దీంతో జాన్ టైటిల్ మార్చాలా? లేదా? అన్న సందిగ్దంలో యువి బృందం నలిగిపోతోందట. ఈ నేపథ్యంలో దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు కాబట్టి ప్రభాస్ సినిమా టైటిల్ మార్చుకోవాల్సి ఉంటుందని ఊహాగానాలొస్తున్నాయి. అయితే ఈ క్లాష్ ఎలా జరిగిందన్నదే సస్పెన్స్. యూవీ క్రియేషన్స్ తో దిల్ రాజుకు మంచి ర్యాపో ఉంది. నిర్మాణం పరంగా…డిస్ట్రిబ్యూషన్ పరంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటారు. కానీ టైటిల్ విషయంలో ఎందుకు ఇరువురి మధ్య డిస్కషన్ రాలేదన్నదే ఆసక్తికరం. అయితే జాను – జాన్ టైటిల్స్ మధ్య డిఫరెన్స్ అర్థం గాక మీడియా రచయితలు ఒక్కోసారి తేడా లేకుండా రాసేస్తుంటే ఇది అది కదా! అనుకోవాల్సిన కన్ఫ్యూజన్ నెలకొంటోంది. దీంతో ఈ డైలమాని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇరువురు నిర్మాతలపైనా ఉంది మరి.
Please Read Disclaimer