జాను: ఓపెనింగ్ డే కలెక్షన్స్

0

దిల్ రాజు నిర్మాణంలో సమంతా-శర్వానంద్ ప్రధాన పాత్రలలో నటించిన ప్రేమకథా చిత్రం ‘జాను’. తమిళ సూపర్ హిట్ ’96’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు వెర్షన్ కు తమిళ ఒరిజినల్ దర్శకుడు C. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం. సినిమాకు డీసెంట్ రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది.

అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం ఉసూరుమనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు షుమారుగా రెండు కోట్ల షేర్ మాత్రమే లభించింది. ఇక అమెరికాలో కలెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ శర్వానంద్ లాస్ట్ సినిమా ‘రణరంగం’ మొదటి రోజు కలెక్షన్స్ కంటే తక్కువగా ఉండడం గమనార్హం. సినిమాకు బాగుందని టాక్ వచ్చినప్పటికీ స్లో గా ఉండడంతో బీ.. సీ సెంటర్లలోప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అలా అని ఎ సెంటర్లలో అయినా భారీ స్పందన దక్కిందా అంటే అదీ లేదు. మొదటి వారాంతంలో కలెక్షన్లను చూస్తేనే మనం సినిమా ఫలితంపై ఒక అంచనాకు రాలేం.

‘జాను’ సినిమాకు మొదటి నుంచి ప్రమోషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి. పైగా స్లోగా ఉండే సినిమాలకు మొదటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ తక్కువే. ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా బీ సీ సెంటర్ల ప్రేక్షకుల్లో పెద్దగా స్పందన దక్కదు. ప్రస్తుతం ‘జాను’ పరిస్థితి కూడా అలానే ఉంది. మరి ఫుల్ రన్ లో సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer