జానుకు ఓవర్సీస్ లో భారీ షాక్!

0

సమంతా-శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘జాను’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ ఫిలిం ’96’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్ లో రెస్పాన్స్ దారుణంగా ఉందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ జస్ట్ 68k డాలర్లు.

నిజానికి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ’96’ ను ఓవర్సీస్ ఆడియన్స్ లో ఎక్కువమంది చూశారు. ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఒరిజినల్ సినిమాను చూసి ఉండడంతో తెలుగు రీమేక్ పై ఆసక్తి తగ్గింది. తెలుగు సినిమాల్లో కథనం నత్తనడకన నడిస్తే ఎక్కువమంది తెలుగు ప్రేక్షకులు భరించలేరు. ఈ స్లో నరేషన్.. మిక్స్డ్ టాక్ రావడం సినిమాకు మైనస్ గా మారాయని టాక్ వినిపిస్తోంది. అసలే తమిళ వెర్షన్ చూసేసిన ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి మరీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదని అంటున్నారు.

సినిమాకు ప్రమోషన్స్ కూడా వీక్ గా ఉండడం.. ‘జాను’ టీమ్ సినిమాపై హైప్ పెంచలేకపోవడం కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ తక్కువగా ఉండడానికి ఇతర కారణాలు అని అంటున్నారు. ఏదేమైనా సంక్రాంతి సీజన్లో కాస్త మెరుగైనట్టుగా కనిపించిన ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు చతికిలపడడం ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.
Please Read Disclaimer