సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

అమెరికా లో జాను 100 పర్సెంట్ వాషౌట్!!

0

ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేకులుగా తెరకెక్కించినప్పుడు ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తి ఉంటుంది. కొంచెం బజ్ తెచ్చుకున్నా హిట్ టాక్ వచ్చేస్తుంది. అయితే కొన్నిసార్లు మాత్రం అలా జరగదు. ప్రేక్షకులు రీమేక్ ను అసలు పట్టించుకోరు. ‘జాను’ విషయంలో ప్రస్తుతం అలానే జరిగింది.

ఈ సినిమా క్లాస్ టచ్ తో ఉంటుంది. పైగా స్లో నరేషన్. ఇలాంటి సినిమాలు బీ..సీ సెంటర్ల ప్రేక్షకులకు పెద్దగా ఎక్కవు కానీ మల్టిప్లెక్స్ ఆడియన్స్.. ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రం నచ్చే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ ను మెప్పిస్తుందని ఎవరైనా అంచనా వేస్తారు. అయితే ఓవర్సీస్ లో సీన్ పూర్తి గా రివర్స్ అయింది. గురువారం ప్రీమియర్లతో కలిసి మొదటి వీకెండ్ లో ఈ సినిమా 1.6 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇవి నామ మాత్రపు వసూళ్లు అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ కలెక్షన్లు రిలీజ్ ఖర్చులకు కూడా సరిపోవు. దీంతో ‘జాను’ ఓవర్సీస్ లో పూర్తిగా తన పెట్టుబడిని పోగొట్టుకున్నట్టే.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పరిస్థితి ఆశాజనకంగా లేదు. మొదటి వీకెండ్ లోనే తక్కువ కలెక్షన్లు వచ్చాయి.. వీక్ డేస్ లో వసూళ్లలో మరింతగా డ్రాప్ కనిపించింది. ఫుల్ రన్లో ఈ సినిమా 60% పెట్టుబడిని వెనక్కు తీసుకొస్తే గొప్ప అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer