ఆమెను 12 ఏళ్లు ప్రేమించా.. నన్ను వదిలి వేరొకడితో..: సుడిగాలి సుధీర్ రియల్ లవ్ స్టోరీ

0

ఐదో తరగతిలో ఉండగా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డా.. ప్రాణంగా ప్రేమించా.. 9 తరగతిలో ఆమెకు నా ప్రేమ గురించి చెప్పా.. యాక్సెప్ట్ చేసింది.. ఒకర్నొకరం ఇష్టపడ్డాం.. కొన్నాళ్ల పాటు మా ప్రేమ సాఫీగానే సాగింది. ఇంతలో నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి రావాల్సివచ్చింది. ఆ తరువాత ఏమైందంటే అంటూ తన ప్రేమకథను చెప్పి ఎమోషన్ అవుతున్నాడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్.

సుధీర్  అమ్మాయిల్న పటాయిస్తాడు.. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయి.. రష్మితో రిలేషన్స్‌లో ఉన్నాడు. అంటూ చాలా పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని అసలు తాను ఏ అమ్మాయిని ఇష్టపడనంటున్నాడు సుధీర్. అంతే కాదు అమ్మాయిలతో మాట్లాడటమే ఇష్టం లేదంటున్నాడు. ఏమైంది బాస్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావ్ అంటే.. తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.

ఇదీ నా ప్రేమకథ..
నేను జబర్దస్త్ రాక ముందు ఒక అమ్మాయిని ప్రేమించా. ఐదవ తరగతిలో ఉండగా ప్రేమించడం మొదలుపెట్టా ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి 9 వ తరగతిలో నా ప్రేమను ఒప్పుకుంది. కొన్నాళ్లు పాటు మా లవ్ బాగానే సాగింది. కాని సడెన్‌గా నేను ప్రేమించిన అమ్మాయి ఇంకొడ్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది.

నేను జాబ్ కోసం ఆమెకి దూరంగా ఫిల్మ్ సిటీకి వస్తే.. ఆమె వేరొకడ్ని పెళ్లి చేసుకుంది. ఆమె చదువుకుంటూ అక్కడే తన క్లాస్ మేట్‌ని లవ్ చేయడం మొదలుపెట్టింది. ఆ విషయం నాకు ఎవరో చెప్తే నేను నమ్మలేదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు.. నా కోసం ఎదురుచూస్తుందని చెప్పా. 12 ఏళ్లు ప్రేమించా తను అలా చేయదనుకున్నా. కాని సడెన్‌గా ఆమె నాకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడ్ని పెళ్లి కూడా చేసేసుకుంది. అప్పటి నుండి ప్రేమించడం మానేశా. అంతే కాదు అమ్మాయిలతో మాట్లాడటమే మానేశా’ అంటూ తన ఫెయిల్యూర్ ప్రేమకథను చెప్పుకొచ్చారు సుధీర్.
Please Read Disclaimer