జబర్దస్త్ లో ఉండేది ఎవరు? పోయేది ఎవరు?

0

తెలుగు బుల్లి తెరను గత 8 సంవత్సరాలుగా ఏళేస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ కామెడీ షో ఆ ఛానెల్ ను టాప్ ప్లేస్ లో ఉంచుతుంది. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో తో ఇటు ఈటీవీకి అటు కమెడియన్స్ కు నిర్మాతలకు అందరికి కూడా భారీ లాభాలు వచ్చాయి. ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గినా మొదటి అయిదు సంవత్సరాలు ఎప్పుడు కూడా రికార్డు స్థాయి రేటింగ్ లతో కుమ్మేసింది. ఇప్పటికి కూడా బాగానే టీఆర్పీ రేటింగ్ ఉంది. కాని జబర్దస్త్ ఫ్యామిలీ బ్రేక్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

జబర్దస్త్ డైరెక్టర్ నిఖిల్ తో మల్లెమాల వారికి పారితోషికం విషయంలో చెడిందని.. ఆ కారణంగానే నిఖిల్ జీ తెలుగును ‘గ్యాంగ్ స్టర్స్’ అనే కామెడీ షో కాన్సెప్ట్ తో సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నిఖిల్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో జీ తెలుగు వారు నాగబాబుకు భారీ పారితోషికం ఆఫర్ చేసి ఆహ్వానించారట. నాగబాబుతో పాటు అనసూయ.. సుడిగాలి సుధీర్ టీం.. హైపర్ ఆది టీం ను కూడా భారీ పారితోసికం ఆఫర్ చేసి ఆహ్వానించారట.

నాగబాబు ఇప్పటికే జీ తెలుగుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. కాని కమెడియన్స్ మాత్రం మల్లెమాల వారితో అగ్రిమెంట్ ఉన్న కారణంగా ఇప్పటికప్పుడు జజర్దస్త్ ను వదిలి వెళ్లే పరిస్థితి లేదట. గ్యాంగ్ స్టర్స్ ను మొదట నిఖిల్ దర్శకత్వంలో నాగబాబు గెస్ట్ గా పాత జబర్దస్త్ కంటెస్టెంట్స్ ధన్ రాజు.. వేణు ఇంకా కొంతమందిని తీసుకుని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయట. ఆ తర్వాత మద్యలో జబర్దస్త్ కమెడియన్స్ జాయిన్ అవుతారంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి జీ తెలుగులో గ్యాంగ్ స్టర్స్ కామెడీ షోతో జబర్దస్త్ కు నష్టం కన్ఫర్మ్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Please Read Disclaimer